For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖాండ్వీ తయారీ: ఇంటివద్దనే సెనగ ఖాండ్వీ తయారీ ఎలా?

గుజరాతీ ఖాండ్వీగా పిలవబడే సెనగపిండి ఖాండ్వీ గుజరాతీయుల ఆహారంలో ఎంతో ప్రసిద్ధిచెందిన చిరుతిండి. ఇంట్లో సులభంగా చేసుకోదగ్గ ఈ వంటకాన్ని అందరూ అడిగి అడిగి మరలా తింటారు చూడండి !

Posted By: Deepthi
|

గుజరాతీ ఖాండ్వీగా పిలవబడే సెనగపిండి ఖాండ్వీ గుజరాతీయుల ఆహారంలో ఎంతో ప్రసిద్ధిచెందిన చిరుతిండి. ఇంట్లో సులభంగా చేసుకోదగ్గ ఈ వంటకాన్ని అందరూ అడిగి అడిగి మరలా తింటారు చూడండి !

సెనగపిండి, పెరుగుతో తయారయ్యే ఈ చిన్న చిన్న మెత్తని కట్ చేసిన స్వీట్లను, సులభంగా ఇంట్లోనే తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఇబ్బందిపెట్టే విషయం సెనగపిండి బాగా కలవడం. గుజరాతి ఖాండ్వీలో ఉండే తగినంత పుల్లదనం, ఉప్పదనం కలిసి ఈ వంటకం చాలా రుచికరంగా, సంతృప్తికరంగా మారుతుంది. దీన్ని కొత్తిమీర పచ్చడి లేదా కెచప్ తో కలిపి తింటారు. మీ సాయంకాలపు టీకి ఇది చక్కని మిత్రుడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఎలా వండుకోవాలో వీడియోలు, ఫోటోలతో సహా ఈ వ్యాసం చదివేసి తొందరగా మీ వంట మొదలుపెట్టండి.

ఖాండ్వీ రెసిపీ వీడియో

ఖాండ్వీ తయారీ । ఖాండ్వీ ఎలా తయారుచెయ్యాలి । గుజరాతీ ఖాండ్వీ తయారీ వీడియో ఖాండ్వీ తయారీ । ఖాండ్వీ తయారుచెయ్యటం ఎలా । గుజరాతీ ఖాండ్వీ రెసిపీ వీడియో
Prep Time
10 Mins
Cook Time
35M
Total Time
45 Mins

Recipe By: ప్రియాంక త్యాగి

Recipe Type: చిరుతిండి

Serves: నలుగురికి

Ingredients
  • సెనగపిండి -1 కప్పు

    పెరుగు - 1/2 కిలో

    నీరు - 1 కప్పు

    ఉప్పు రుచికి కావాల్సినంత

    పసుపు - అరచెంచా

    ఇంగువ - అరచెంచా

    నూనె - 3 చెంచాలు

    ఆవాలు - 1 చెంచా

    కరివేపాకు - 5-6

    కొత్తిమీర (బాగా తరిగినవి ) - 4 చెంచాలు

    కొబ్బరి (కోరినవి) 4 చెంచాలు

How to Prepare
  • 1. పెరుగును మధ్య సైజు గిన్నెలో పోసి, మృదువుగా అయ్యే వరకు కలపండి.

    2. పసుపు, ఇంగువ, ఉప్పు తగినంత వేసుకోండి.

    3. అప్పుడు సెనగపిండి వేసి బాగా పిండిలా వచ్చేలాగా మొత్తం మిశ్రమాన్ని కలపండి.

    4. కడాయిని వేడిచేయండి, మంటను మధ్యలో ఉంచి పై మిశ్రమాన్ని అందులో పోయండి.

    5. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండండి, మిశ్రమం గట్టిపడి పేస్ట్ లా తయారవుతుంది.

    6. అదే సమయంలో, ఒకటి లేదా రెండు పళ్ళేలపై నూనె రాసి పెట్టుకోండి. గరిటె వాడి ఆ పేస్ట్ ను పళ్ళాలకు సమంగా వేసి రాయండి.

    7. 5 నిమిషాల పాటు చల్లబడనివ్వండి.

    8. 2 అంగుళాల మేరకు పొడవుగా కట్ చేయండి.

    9. కొబ్బరి, కొత్తిమీర మిశ్రమాన్ని పైన చల్లండి.

    10. ఈ కట్ చేసినవాటిని గుండ్రంగా ఏది విచ్చుకోకుండా కట్టండి.

    11. కొంత నూనెను పెనంలో వేసి వేడిచేయండి ( ముందు వాడినట్టుగా).

    12. ఆవాలను వేసి వేయించండి.

    13. కరివేపాకును కూడా వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయండి.

    14. దీన్ని ఖాండ్వీపై పోసి మరలా కొబ్బరి-కొత్తిమీర పొడితో అలంకరించండి.

Instructions
  • 1. కొబ్బరి,కొత్తిమీరను కోరి, తరిగి ముందే వేరే కలిపి పెట్టుకోండి.
  • 2. పేస్ట్ ను ఎప్పుడు సరిగ్గా మంటపై నుంచి తీసేయాలో తెలుసుకోవాలంటే, కొంచెం మిశ్రమాన్ని పళ్ళెంకి రాసి, అది చల్లబడ్డాక, అది సులువుగా ఊడివచ్చి, చుట్టడానికి వచ్చేస్తే, అది బాగా తయారయినట్టు. ఇక మొత్తాన్ని తీసేయండి.
Nutritional Information
  • సరిపోయేది - 15 ముక్కలు
  • క్యాలరీలు - 94 cal
  • కొవ్వు - 4.5 గ్రాములు
  • ప్రొటీన్లు - 3.8 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 9.4 గ్రాములు
  • ఫైబర్ - 2.5 గ్రాములు

ఖాండ్వీ తయారుచేసే విధానం

1.పెరుగును మధ్య సైజు గిన్నెలో పోసి, మృదువుగా అయ్యే వరకు కలపండి.

2.పసుపు, ఇంగువ, ఉప్పు తగినంత వేసుకోండి.

3.అప్పుడు సెనగపిండి వేసి బాగా పిండిలా వచ్చేలాగా మొత్తం మిశ్రమాన్ని కలపండి.

4.కడాయిని వేడిచేయండి, మంటను మధ్యలో ఉంచి పై మిశ్రమాన్ని అందులో పోయండి.

5.ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండండి, మిశ్రమం గట్టిపడి పేస్ట్ లా తయారవుతుంది.

6.అదే సమయంలో, ఒకటి లేదా రెండు పళ్ళేలపై నూనె రాసి పెట్టుకోండి. గరిటె వాడి ఆ పేస్ట్ ను పళ్ళాలకు సమంగా వేసి రాయండి.

7.5 నిమిషాల పాటు చల్లబడనివ్వండి.

8.2 అంగుళాల మేరకు పొడవుగా కట్ చేయండి.

9.కొబ్బరి, కొత్తిమీర మిశ్రమాన్ని పైన చల్లండి.

10.ఈ కట్ చేసినవాటిని గుండ్రంగా ఏది విచ్చుకోకుండా కట్టండి.

11.కొంత నూనెను పెనంలో వేసి వేడిచేయండి ( ముందు వాడినట్టుగా).

12.ఆవాలను వేసి వేయించండి.

13.కరివేపాకును కూడా వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయండి.

14. దీన్ని ఖాండ్వీపై పోసి మరలా కొబ్బరి-కొత్తిమీర పొడితో అలంకరించండి.

[ 3.5 of 5 - 52 Users]
English summary

Khandvi Recipe | How To Make Khandvi | Gujarati Khandvi Recipe Video

Khandvi Recipe - Images, Videos & Step by step procedure. Here is a step by step procedure to make the soft, fluffy and sinfully delicious khandvi recipe at home. It is quick and simple snack recipe that can be prepared in just 45 minutes.
Desktop Bottom Promotion