ఈ పప్పుపై,మాంసాహారం కూడా పనికిరాదు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రుచి కూడా ఎలా చేసుకోవాలంటే?

ఆకుకూరల్లో బచ్చలి కూర పోషకాలతో నిండి ఉన్న కూర. ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్స్, యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ బచ్చలికూరతో పప్పు చేసుకుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. దీనిని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

1 కప్పు కందిపప్పు
2 కప్పుల సన్నగా తరిగిన బచ్చలికూర
1 ఉల్లిపాయ, సన్నగా తరిగినది
2 టమోటాలు, సన్నగా తరిగినవి
1/2 టీస్పూన్ పసుపు పొడి
1 టీస్పూన్ కారం పొడి
1/2 టీస్పూన్ ధనియాల పొడి
1/4 టీస్పూన్ జీలకర్ర పొడి
రుచికి సరిపడా ఉప్పు
2 టేబుల్ స్పూన్ల నూనె
కొద్దిగా ఆవాలు
కొద్దిగా జీలకర్ర
2 ఎండుమిర్చి
కొద్దిగా కరివేపాకు

తయారీ విధానం

ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో వేసి, 2 కప్పుల నీరు పోసి, 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఆ తరువాత ఉడికిన పప్పును మెత్తగా చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి వేయించండి. ఆ తరువాత అందులో ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. అనంతరం అందులో టమాటోలు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించుకోవాలి.

తరువాత పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి మరియు జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. అనంతరం బచ్చలికూర వేసి కొద్దిసేపు వేయించండి. అలాగే ఉడికించిన పప్పు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికించి, వేడి వేడిగా అన్నంతో వడ్డించుకుంటే ఎంతో రుచికరమైన బచ్చలికూర పప్పు సిద్ధమైనట్లే.

[ of 5 - Users]
Story first published: Sunday, February 9, 2025, 18:00 [IST]
Desktop Bottom Promotion