Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
ప్రోటీన్ పుష్కలం, రుచి అద్భుతం..కరకరలాడే పెసరపప్పు మంగోడి..ఇలా చేసెయ్యండి..
మన ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిండిని తయారు చేసుకోవాలనుకుంటే పెసరపప్పు మంగోడి (దీనినే పెసరపప్పు పకోడీ అని కూడా అంటారు)పర్ఫెక్ట్ ఛాయిస్. పైకి బంగారు రంగులో కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండే ఈ మంగోడి సాయంత్రం టీతో పాటు అద్భుతంగా సెట్ అవుతుంది.
రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది సులభంగా జీర్ణమవుతుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు.పెసరపప్పు మంగోడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పొట్టు తీసిన పెసరపప్పు - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1
అల్లం -చిన్న ముక్క
కొత్తిమీర తురుము - 3 టీస్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
వంటనూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా పెసరపప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి.
-పప్పు బాగా నానిన తర్వాత అందులోని నీటిని పూర్తిగా వడకట్టేయాలి. ఇప్పుడు ఈ పప్పును మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. పిండికి నీళ్లు కలపకూడదు. పిండి మరీ పల్చగా లేదా మెత్తగా ఉండకూడదు. పిండి పల్చబడితే పకోడీలు కరకరలాడుతూ రావు, ఎక్కువ నూనె పీల్చుకుంటాయి.
-ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మీకు మరింత ఘాటు, రుచి కావాలంటే కొద్దిగా కారం లేదా కొంచెం చాట్ మసాలా కూడా ఈ పిండిలో కలుపుకోవచ్చు.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనెతో ఒక కడాయిని పెట్టుకోండి. నూనె మీడియం వేడికి వచ్చాక చేతితో లేదా ఒక చిన్న చెంచా సహాయంతో పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నూనెలో నెమ్మదిగా వేయండి.
-మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మంగోడీలు అన్ని వైపులా సమానంగా వేగి మంచి బంగారు రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి.
-బాగా వేగిన మంగోడీలను చిల్లుల గరిటెతో తీసుకుని, ఒక ప్లేట్ లోని టిష్యూ పేపర్ పై వేయండి. దీనివల్ల వాటికున్న అదనపు నూనెను పేపర్ పీల్చుకుంటుంది.
-అంతే నోరూరించే, వేడివేడి పెసరపప్పు మంగోడీలు రెడీ. వీటిని పుదీనా కొత్తిమీర చట్నీతో అద్దుకుని తింటే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












