Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కేవలం 50 రూపాయల్లో తయారయ్యే ఈ షర్బత్ తాగితే ఎండాకాలం ఎలాంటి సమస్యలు రావు.. ఎలా చేసుకోవాలంటే?
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరికీ కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చేస్తుంటాయి. చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ పీడిస్తుంటాయి. ముఖం నల్లగా మారడం, వడదెబ్బ తగలడం, చర్మంపై పింపుల్స్ రావడం వంటి సమస్యలు వచ్చేస్తుంటాయి. దీని బారి నుంచి బయటపడేందుకు చాలా మంది రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. కొందరు మెడిసిన్స్ తీసుకుంటారు. మరికొందరు హోమ్ రెమెడీస్ పాటిస్తారు. అయినప్పటికీ వారిలో ఏమాత్రం మెరుగుదల కనిపించక నిరాశకు గురవుతుంటారు.
అయితే అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఈ చిన్న రెసిపీ చేసుకొని తాగితే సరిపోతుంది. ఈ సమస్యల నుంచి చిటికెడు మీరు బయటపడొచ్చు. అలాగే అంతర్గత ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది చేయడానికి రాకెట్ సైన్స్ చదవాల్సిన అవసరం ఏం లేదు. గ్యాస్ ముట్టించడం రాని వ్యక్తి కూడా ఈ రెసిపీని సులభంగా కేవలం కూర్చొని చేసుకోవచ్చు. అంత సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెసిపీ ఏది అని అనుకుంటున్నారా.. కొబ్బరి నెల్ల షర్బత్. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఛలో ఈ కథనంలో ఈ కొబ్బరి నెల్ల షర్బత్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి?.. అంత సింపుల్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్ల షర్బత్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఒకటి కొబ్బరి బోండా
మూడు చెంచాల చియా సీడ్స్
కొన్ని ఐస్ ముక్కలు
కొన్ని పుదీనా ఆకులు
కొబ్బరి నీళ్ల షర్బత్ తయారీ విధానం
ఈ కొబ్బరి నీళ్ల షర్బత్ తయారు చేసుకోవడానికి ముందుగా.. మార్కెట్ నుంచి కొంచెం ఎక్కువ నీళ్లు ఉండి.. లేత కొబ్బరి ఉన్న కొబ్బరి బొండాను తీసుకోవాలి. నీళ్లు తక్కువగా ఉన్నా.. కొబ్బరి ముదిరినా ఇది అంత రుచికరంగా అనిపించకపోవచ్చు. అందుకే మంచి కొబ్బరి బొండాను ఎంచుకోండి.
పిచ్చెక్కించే పచ్చి మామిడికాయ పచ్చడి.. రుచి నషాళానికి ఎక్కాల్సిందే, ఎలా చేసుకోవాలంటే?
ఇప్పుడు కొబ్బరి బొండాను కోసి.. అందులోని నీళ్లను మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అందులో మూడు చెంచాల చియా సీడ్స్ కూడా వేసుకోవాలి. ఆ తరువాత ఆ బౌల్‌ను పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల అందులో మనం వేసిన చియా సీడ్స్ బాగా ఉబ్బిపోతాయి.
ఇప్పుడు కొబ్బరి బొండాను రెండుగా చీల్చి.. అందులోని లేత కొబ్బరిని గరిటెతో లేదా మంచి పెద్ద స్పూన్‌తో తీసుకోవాలి. ఆ కొబ్బరినంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ముగిసే వరకు మనం ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ బాగా ఉబ్బిపోతాయి.
ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని.. చియా సీడ్స్ నానబెట్టిన కొబ్బరి నీళ్లలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీటిలో గుప్పెడు పుదీనా ఆకులను కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఓసారి కలుపుకోవాలి. అంతే.. ఎంత రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్ల షర్బత్ సిద్ధమైనట్లే. దీనిని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలో వేడి తగ్గిపోవడంతో పాటు ముఖంపై వచ్చే పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. అలాగే మన బాడీ డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉంటుంది. చర్మం తేమగా, తాజాగా మెరిసిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












