Nizam Chicken: నిజాం నవాబుల చికెన్ కూర.. అబ్బబ్బా నోట్లో పెట్టుకునే నాలుక నాట్యమాడాల్సిందే!

పాతకాలం వంటలు ఏవైనా చాలా రుచికరంగా ఉంటాయి. వాటిని తింటున్నప్పుడు తిన్న ఫీలింగ్ కూడా కలగదు. ఆ రుచిలో మైమరచిపోయి ఎంత అన్నం అయినా తినేస్తారు. అలాంటి ఒక రెసిపీ గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే నిజాం చికెన్ రెసిపీ. చుక్క నీరు లేకుండా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిజాం చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు

  1. కేజీ చికెన్
  2. పసుపు
  3. ఉప్పు
  4. గరం మసాలా
  5. కుంకుమ పువ్వు వేసిన పాలు
  6. పెరుగు
  7. జీడిపప్పు, కొబ్బరి, బాదం పేస్ట్
  8. గసగసాలు
  9. కొత్తిమీర
  10. పుదీనా
  11. ఫ్రైడ్ ఆనియన్స్
  12. నెయ్యి
  13. నూనె

నిజాం చికెన్ తయారీ విధానం

ఈ నిజాం చికెన్ తయారీ చేసుకోవడానికి ముందే.. ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం, కొబ్బరిని వేసి కొంచెం నీరు పోసి ఓ ముద్దగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని.. ఐస్ క్యూబ్స్ వేసుకున్న నీటిలో కొంచెం ఉప్పు వేసి.. చికెన్‌ను ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా మెత్తగా తయారవుతుంది.

ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్‌ను వేసుకోవాలి. అలాగే అందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక కప్పు కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కుంకుమ పువ్వు వేసిన పాలు, ఒక కప్పు పెరుగు, ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కొబ్బరి పేస్ట్, గసగసాలు, గుప్పెడు పుదీనా, ముందుగా చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.

ఇప్పుడు చికెన్‌తో పాటు అందులో వేసిన మసాలాలు అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు అంతా చికెన్‌కు మంచిగా పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఒక అరగంట వీలైతే గంట సేపు పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను అలానే తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేయాలి.

కేవలం సిమ్‌లోనే ఒక అరగంట పాటు బాగా ఉడకబెట్టుకోవాలి. అరగంట పాటు అటూ ఇటూ కదలనివ్వకున్నా అలానే సిమ్‌లోనే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్‌ను ఓసారి కలుపుకొని ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఉడకపోతే ఇంకో అయిదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత దానిపై కొత్తిమీర చల్లుకొని దించే నిజాం నవాబుల చికెన్ సిద్ధమైనట్లే.

[ of 5 - Users]
Story first published: Friday, December 20, 2024, 9:48 [IST]
Desktop Bottom Promotion