Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఉల్లి, టమాటా లేకున్నా ఫర్వాలేదు..5 నిమిషాల్లో అదిరిపోయే చట్నీ రెడీ
దక్షిణ భారతదేశంలో ఇళ్లల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఎక్కువగా తయారుచేసేవి ఇడ్లీ, దోశ. అయితే ఇందులోకి కాంబినేషన్ గా చాలామంది ఎప్పుడూ రొటీన్‌గా కొబ్బరి చట్నీయో లేదా టమోటా చట్నీయో చేస్తుంటారు. ఒకే రకం రుచి చూసి నాలుకకు బోర్ కొట్టేస్తుందా?
ముఖ్యంగా బ్యాచిలర్స్, ఉద్యోగాలకు వెళ్లేవారు ఉదయం పూట హడావిడిలో కూరగాయలు తరిగే సమయం లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఉల్లిపాయ, టమోటా అవసరం లేకుండానే.. కేవలం వంటింట్లో ఉండే శనగపప్పు, ఎండుమిర్చితో ఎంతో రుచికరమైన చట్నీని చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఇది నోటికి కమ్మగా ఉండే ఈ స్పెషల్ శనగ చట్నీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
శనగపప్పు (పల్లీలు) - పావు కప్పు
ఎండు మిరపకాయలు - 8
వెల్లుల్లి రెబ్బలు - 6
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
చింతపండు - చిన్న నిమ్మకాయంత
తురిమిన కొబ్బరి - పావు కప్పు (పచ్చిది లేదా ఎండుది)
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకి నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు - పావు టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె కాస్త వేడయ్యాక శనగపప్పు వేసి తక్కువ మంట మీద దోరగా వేయించుకోవాలి.
-శనగపప్పు వేగాక అందులో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఎండుమిర్చి రంగు మరీ నల్లగా మారకుండా చూసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, చింతపండును కూడా వేసి కాసేపు వేయించాలి. చివరగా తురిమిన కొబ్బరిని వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-వేయించి చల్లార్చిన పదార్థాలన్నింటినీ ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. దీనికి రుచికి సరిపడా ఉప్పు జత చేయండి. మొదట నీళ్లు పోయకుండా ఒకసారి మిక్సీ తిప్పండి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-మీకు చట్నీ గట్టిగా కావాలంటే తక్కువ నీళ్లు, పలచగా కావాలంటే మరికొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి, తాలింపు కోసం నూనె వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత మినప్పప్పు వేసి ఎర్రగా వేయించాలి. చివరగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసి, కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వేడి వేడి తాలింపును ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీలో వేసి బాగా కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, కమ్మటి శనగ చట్నీ రెడీ. దీని కోసం ఉల్లిపాయలు తరగాల్సిన పనిలేదు, టమోటాలు మగ్గాల్సిన అవసరం లేదు. వేడి వేడి ఇడ్లీల్లోకి లేదా కరకరలాడే దోసెల్లోకి ఈ చట్నీని వడ్డించుకుని తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












