For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ ఖీమా రిసిపి: టేస్టీ అండ్ హెల్తీ

|

ఆలూ ఖీమా చాలా టేస్టీ అండ్ హెల్తీ సింపుల్ డిష్. ఈ ఖీమా రిసిపి చాలా సులభంగా తయారుచేయవచ్చు. మరియు ఆలూ ఖీమా రిసిపి మాంసాహారాల్లో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఖీమాతో పాటు బంగాళదుంపను మిక్స్ చేసి తయారుచేయడమే.

ఈ ఆలూ ఖీమా రిసిపి చాలా టేస్ట్ గా ఉంటుంది. అతి తక్కువు మసాలాలతోనే తయారుచేయవచ్చు . ఇది రోటీ మరియు రైస్ కు మంచి కాంబినేషన్ . మరి ఈ ఖీమా రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Telugu Vantalu


కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు - 2
ఖీమా - 500 gms (chicken/mutton/beef)
బంగాళ దుంప - 300 gms
అల్లం పేస్ట్ - 1 tsp
వెల్లుల్లి పేస్ట్ - 1 tsp
కారం - 2 tsp
ధనియాలపొడి - 1 tsp
పసుపు - ½ tsp
పెరుగు - 2 tsp
టమోటోలు - 1 cup (diced)
గరం మసాలా - 1 tsp
పచ్చిమిర్చి - 1
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత అందులో ఖీమా కూడా వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు మిగిలిన మసాలాలు వేసి మొత్తం మిశ్రమం కలగలిసేలా మిక్స్ చేయాలి . తర్వాత అందులో కొన్ని నీళ్ళు మిక్స్ చేసి మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి.
5. అందులోనే సన్నగా తరిగిన టమోటో ముక్కలు మరియు పెరుగు మిక్స్ చేసి మరో 10నిముసాలు ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
8. మొత్తం మిశ్రమం ఫ్రై అయిన తర్వాత అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి మీడియం మంట మీద 15 నిముషాలు ఉడికించుకోవాలి. బంగాళదుంప మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.
9. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, చిల్లీ పౌడర్ మరియు కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసి, 5 నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే ఆలూ ఖీమా రెడీ. దీన్ని రోటీ మరియు రైస్ తో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Aloo Keema Recipe: Tasty and Healthy: Telugu Vantalu

Today, we are here to present a delicious recipe of aloo keema. This keema recipe can be made using any of the meats and a good amount of potatoes in it.
Story first published: Friday, July 24, 2015, 15:15 [IST]
Desktop Bottom Promotion