For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర స్టైల్ చికెన్ 65

|

చికెన్ 65 చాలా ఫేమస్ స్నాక్. ఈ చికెన్ రిసిపిలకు వివిధ రకాల పేర్లు ఉంటాయి. చికెన్ 65 పేరు వెనుక పెద్ద కథ ఉంది. చికెన్ 65 వంటకాన్ని పరిచయం చేసిది 1965లో చెన్నైలో ఒక పెద్ద రెస్టారెంట్. అనుకోకుండా ఈ వంటకం పేరు మెనులో 65సార్లు కనబడింది అప్పటి నుండి దీనికి చికెన్ 65 అని పేరు .

చికెన్ 65 చాలా స్పైసి రిసిపి. రుచి కూడా అద్భుతం. వివిధ మసాలాలతో మ్యారినేట్ చేసి తయారు చేసే చికెన్ 65 డీఫ్ ప్రై చేయడం వల్ల రుచి, రంగు, వాసన అద్భుతంగా ఉంటాయి. మరి మీరు కూడా చికెన్ 65తినాలనుకంటే ఒక సారి ట్రై చేసి చూడండి...

Andhra Style Chicken 65 Recipe

ఎముకలు లేని చికెన్: 500gms (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నిమ్మరసం: 1tbsp
అల్లం:వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం: 2tsp
పెప్పర్ పౌడర్: 1tsp
జీలకర్ర పొడి: ½ స్పూన్
పసుపు: ఒక చిటికెడు
కార్న్ ఫ్లోర్:1tbsp
బియ్యం పిండి: 1tsp
గుడ్డు: 1
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిరపకాయలు: 3-4
ఉప్పు: రుచికి సరిపడా
నూపె: డీప్ ఫ్రైకు సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి, కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నిమ్మరసం, ఉప్పు, వేసి మిక్స్ చేసి చికెన్ కు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మరో బౌల్లో కార్న్ ఫ్లో, బియ్యం పిండి, గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెప్పర్ పౌడర్, జీకలర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ముందుగా నిమ్మరసంలో మారినేట్ చేసిపెట్టుకొన్న చికెన్ ను కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసి మరో గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. ఒక గంట తర్వాత, డీప్ ప్రైయింగ్ పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేసి ఒకనిముషం వేగిన తర్వాత వాటిని ఒక చిన్న బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అదేపాన్ లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి, 15నిముషాలు పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
6. చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేంచి స్టౌ ఆఫ్ చేసి, సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకొని ఫ్రైడ్ కరివేపాకు మరియు పచ్చిమిర్చితో గార్నిష్ చేసి వేడి వేడి గా సర్వ్ చేయాలి. అంతే ఆంధ్ర స్టైల్ చికెన్ 65 రెడీ

English summary

Andhra Style Chicken 65 Recipe


 Chicken 65 is a famous snack recipe. It is an interesting chicken recipe with a unique name. The name also has a story behind it. Chicken 65 recipe was first introduced by a well known restaurant in Chennai in the year 1965. Co-incidentally, this recipe appeared as the 65th item on the restaurant's menu.
Story first published: Saturday, June 8, 2013, 13:09 [IST]
Desktop Bottom Promotion