ప్రాన్స్ - మ్యాంగో గ్రేవీ రిసిపి

Posted By:
Subscribe to Boldsky

రెగ్యులర్ గా తయారుచేసుకునే చికెన్ రిసిపిల కంటే కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నిస్తే కొంచెం రిఫ్రెష్ గా..కొత్త రుచిని టేస్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఫ్రాన్ రెగ్యులర్ రిసిపిల కంటే ప్రయోగాత్మకంగా చేసే వంటలు చాలా కొత్తగా..కొత్త రుచులను అందిస్తుంది. ప్రాన్స్ -మ్యాంగో కాంబినేషన్ రిసిపి చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది బెంగాళీ స్టైల్ రిసిపి.

సహజంగా సీఫుడ్ విషయానికొస్తే , చాలా మంది ఇల్లలో ప్రాన్స్ చాలా పాపులర్. ప్రాన్స్ తో వివిధ రకాల వెరైటీ వంటలను ట్రై చేయవచ్చు. ఈ వంటలు తయారుచేయడం కూడా చాలా సులభంగా, తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. ప్రాన్స్ తో వివిధ రకాల వంటలను తయారుచేసుకుని తినడమంటే చాలా మందికి ఇష్టం.

పాలక్ ప్రాన్ కర్రీ రిసిపి: వీకెండ్ స్పెషల్

కొన్ని రెగ్యులర్ మసాలా దినుసులతో పాటు ప్రాన్స్ తో కర్రీస్, ఫ్రైలు తయారుచేసుకుని తినడం వల్ల డిఫరెంట్ రుచిని ఆస్వాదిస్తుంటారు. అంతే కాదు దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో డిఫెరెంట్ స్టైల్లో తయారుచేసుకుంటారు. ది బెంగాలి చింగ్రి(ప్రాన్ ), మలైకర్రీ గోవా వంటి ప్రదేశంలో చాలా డిఫరెంట్ గా తయారుచేస్తుంటారు. బెంగాల్ చింగ్రి, గోవాన్ ప్రాన్ కర్రీ చాలా వెరైటీగా ఉంటాయి.

అందువల్ల, మీరు కూడా ప్రాన్స్ తో ఏదైనా డిఫరెంట్ గా..క్రిస్పిగా ప్రయత్నించాలనుకుంటే మీకోసం ఒక డిఫరెంట్ ప్రాన్ కర్రీ రిసిపి ఉంది. దీన్ని వైట్ రైస్ తో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన రుచికలిగిన ప్రాన్ మ్యాంగ్ గ్రేవీ రిసిపిని మనం ఈ రోజు ప్రయత్నిస్తాం..అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ గురించి వివరంగా తెలుసుకుందాం..

prawns recipe

కావల్సిన పదార్థాలు:

 • ఫ్రెష్ గా ఉండే ప్రాన్స్ : 250 గ్రాములు
 • ఫ్రెష్ కోకనట్ తురుము: 4 టేబుల్ స్పూన్లు
 • ఆవాలు: 2టీస్పూన్లు
 • పచ్చిమామిడికాయ తురుము : 3 టేబుల్ స్పూన్లు
 • పచ్చిమిర్చి : 4 (సన్నగా కట్ చేసుకోవాలి)
 • ఆవనూనె: 1 టేబుల్ స్పూన్
 • అర టీస్పూన్ : 1 టీస్పూన్
 • పసుపు : 1/4టీస్పూన్
 • ఉప్పు: రుచికి సరిపడా
 • పంచదార : 1 టీస్పూన్
 • కోకనట్ మిల్క్ : 1 కప్

ప్రాన్ కబాబ్ రిసిపి: ఈవెనింగ్ స్నాక్ రిసిపి

prawns recipe

తయారుచేసుకునే విధానం :

1. బెంగాలీ స్టైల్ ప్రాన్స్ మ్యాంగో తయారుచేసుకోవడానికి సైన సూచించిన పదార్థాలన్ని అవసరం అవుతాయి.

2. ఒక మిక్సీ గ్రైండర్ తీసుకుని, అందులో ఆవాలు , ఒకటి రెండు పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్ళు కలిపి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత పాన్ లో నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో ప్రాన్స్ వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాల ఫ్రై చేసుకోవాలి.

4. తర్వాత అందులోనే పచ్చిమామిడికాయ తురుము, చిటికెడు ఉప్పు వేయాలి. మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ వేగించుకోవాలి.

ప్రాన్స్ -క్యాప్సికమ్ కర్రీ -వింటర్ స్పెషల్

5. పచ్చిమామిడికాయ వాసన పోయే వరకూ, మసాలా వాసన పోయే వరకూ వేగించుకోవాలి. దాదాపు రెండు నిముషాల పాటు వేగించుకోవాలి.

6. ఇప్పుడు అందులోనే మస్టర్డ్ పేస్ట్, పసుపు, కారం వేసి మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

6. తర్వాత అందులోనే కొబ్బరి పాలు, ఉప్పు, పంచదార వేసి మిక్స్ చేసి, మూత పెట్టి ఉడికించుకోవాలి. తక్కవు మంట మీద ఉడికించడం వల్ల ఆవిరిలో ప్రాన్ బాగా ఉడుకుతాయి.

మసాలా ప్రాన్స్ కు బాగా పడుతుంది. ప్రాన్స్ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.

7. అంతే బెంగాలి స్టైల్ ఆమ్ చింగ్రి రిసిపి (మ్యాంగో విత్ మస్టర్డ్ సాస్ ) రిసిపి రెడీ. ఇది అన్నంకు ఫర్ఫెక్ట్ కాంబినేషన్ .

English summary

Bengali Aam Chingri Recipe

Bengali Aam Chingri Recipe (Prawns With Mango In Mustard Sauce) is a delicious and tangy side dish made with sauteed prawns and raw mango which are fleshed up in a creamy sauce made of mustard and coconut with spices.
Story first published: Wednesday, July 5, 2017, 12:00 [IST]
Subscribe Newsletter