For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాయం సంధ్యవేళ.. ‘వేడి వేడి చికెన్ పకోడా..!!

సాయం సంధ్యవేళ.. ‘వేడి వేడి చికెన్ పకోడా..!!

|

Chicken Pakora
అసలే వర్షాల కాలం, ఆపై చల్ల గాలి చంపేస్తుంటుంది.. చల్లటి సాయం సంధ్యవేళ వరండాలో కూర్చుని, వేడి.. వేడిగా చికెన్ పకోడా తింటే ఆ అనుభూతే వేరు. మంసాహార ప్రియులు అతిగా ఇష్టపడే 'చికెన్ పకోడా' వంటకాన్ని తక్కువ సయమంలో హాట్.. హాట్ గా తయారుచేసుకోవచ్చు. అది ఏలాగా అంటారా..? అయితే తయారీ విధానాన్ని తెలుసుకోండి..

'చికన్ పకోడా' తయారీకి కావల్సిన పదార్థాలు:
1, మెత్తటి కోడి మాంసం 250 గ్రాములు (చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి).
2. ఉల్లిపాయలు 2.
3. వెల్లులి రెబ్బలు 6.
4. అల్లం కావల్సినంత.
5. పచ్చిమిరపకాయలు తరిగినవి 4.
6. మిరియాల పొడి రెండు టీస్పూన్లు.
7. పేలాల పిండి 4 టేబుల్ స్పూన్లు.
8. రొట్టె ముక్కలు తగినన్ని.
9. నూనె 4 టేబుల్ స్పీన్లు.
10. సాల్ట్ తగినంత.

తయారుచేసుకునే విధానం :
చాకుతో లేదా మిక్సర్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న మాంసానికి అల్లం, ఉల్లిముక్కలు, వెల్లలి రెబ్బలు, పచిమిర్చి తురుమును జోడించి గ్రైండర్ లో వేసుకోవాలి. నలుగుతున్న మిశ్రమంలో మిరియాల పొడితో పాటు తగినంత సాల్ట్ ను చల్లాలి. గ్రైండ్ అవుతున్న మిశ్రమంలో అరకప్పు నీటిలో కలిపిన పేలాల పిండిని నిదానంగా కలుపుతుండాలి.

మిశ్రమాన్ని చిక్క పడేంత వరకు గ్రైండ్ చేసి, తరవాత మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి. తయారైన బాల్స్ ను రొట్టె ముక్కల్లో చుట్టి వేపేందుకు సిద్ధంగా ఉంచుకోవాలి. పేనంపై నూనె వేడెక్కిన తరువాత సిద్ధం చేసుకున్న బాల్స్ ను కాగిన నూనె పై పరిచి వేగేంత వరకు ఉంచాలి. మీరు కోరుకున్న చికెన్ పకోడా వేడివేడిగా ఆరగించటమే తరువాయి. మీ అభిరుచికి తగ్గట్లుగా 'సాస్' లేదా 'చట్నీని' పకోడాలో నంచుకోవచ్చు.

English summary

Chicken Pakora Recipe| సాయం సంధ్యవేళ.. ‘వేడి వేడి చికెన్ పకోడా’..!!

Here is a chicken pakora recipe that will solve the problem of your evening snacks. Chicken pakoras can be made using an easy chicken snack recipe. If you are bogged down with the problem of making different kinds of snacks for your family every now and then or choosing a tea party menu that requires easy quick chicken recipes, then your problem is solved.
Desktop Bottom Promotion