For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనీస్ టమోటో ఎగ్ రైస్-స్పెషల్ టేస్ట్

మనందరికి తెలుసు గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో. ఇది మన ఆరోగ్యాన్ని పెంచడమే కాదు ఇది చర్మానికి, జుట్టుకు కూడా చాలా ప్రయోజనాల ను అందిస్తుంది. అందుకే ఉడికించిన గుడ్లును తినమని చెబుతుంటారు న్యూట్రి

|

మనందరికి తెలుసు గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో. ఇది మన ఆరోగ్యాన్ని పెంచడమే కాదు ఇది చర్మానికి, జుట్టుకు కూడా చాలా ప్రయోజనాల ను అందిస్తుంది. అందుకే ఉడికించిన గుడ్లును తినమని చెబుతుంటారు న్యూట్రిషియనిస్టులు. దాంతో శరీరానికి కావల్సినంత క్యాల్షియం అందుతుంది. అదే విధంగా, ఉడికించిన గుడ్డును ప్రతి రోజూ తినడం అంటే కొంచెం బోర్ కొడుతుంది. అందుకే కొంచెం డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకొని తినడం వల్ల అదే మోతాదులో పోషకాలను పొందవచ్చు. చాలా మందికి ప్లెయిన్ ఎగ్స్ తినడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా పిల్లలు అసలు ఇష్టపడరు.

టమోటోలను ఎగ్ తో మిక్స్ చేసి చేయడం వల్ల, అదీ చైనీస్ స్టైల్లో చేయడం వల్ల అద్భుతమైన రుచితో పాటు, ఆరోగ్యానికి కావల్సిన పోషకాలను అంధించడంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ స్పైసీ రిసిపి రోజులో ఎప్పుడైన బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, మధ్యహ్నా భోజంలో తీసుకోవచ్చు. మరికెందుకు ఆలస్యం ఈ చైనీస్ స్టైల్ డిష్ తయారు చేసేయండి.

Chinese Tomato Egg Rice

కావల్సిన పదార్థాలు:
టమోటోలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో కెచప్: 4tbsp
గుడ్లు: 4(ఉడికించి, పొట్టుతీసి, కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి)
బాస్మతి రైస్: 3cups(ఉడికించుకోవాలి)
నూనె: 3tbsp
వెల్లుల్లి: 2tbsp(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 4 (సన్నగా కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
వైట్ పెప్పర్ పౌడర్: 1/2tsp
చిన్నఉల్లిపాయలు(గ్రీన్): 5 stalks (chopped)
సోయా సాస్: 2tbsp
కార్న్ ఫ్లోర్ : 2tbsp
వెనిగర్: 4tbsp
తాగా కొత్తిమీర తరుగు: 1/2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి తరుగు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి.
2. తర్వాత అందులోనే చిన్న ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి.
3. ఇప్పుడు ఉడికించిన అన్నం, ఉప్పు మరియు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిముషం పాటు ఉడికించుకోవాలి.
4. తర్వాత ఒక నిముషం పాటు ఉడికించి తర్వాత అందులో ఉడికించి కట్ చేసి పెట్టుకొన్న గుడ్డు ముక్కలను వేసి బాగా మిక్స్ చేయాలి.
5.అంతలోపు, కార్న్ పౌడర్ కొద్దిగా నీళ్లు, ఒక చెంచా వెనిగర్ వేసి బాగా ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో 2కప్పుల నీళ్లు పోసి, బాగా మరిగించాలి. నీళ్లు మరిగే సమయంలో అందులో కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు, టమోటో కెచప్, ఉప్పు చిలకరించి, సోయాసాన్ మరియు పెప్పర్ పౌడర్ వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని అన్నంగుడ్డుమిశ్రమంలో వేసి బాగా పూర్తిగా కలగలుపుకోవాలి.
7. చివరగా అందులో రెండు చెంచాల వెనిగర్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మరో రెండు మూడు నిముషాల పాటు అతి తక్కువ మంటమీద ఉంచి దింపుకోవాలి. అంతే చైనీస్ టమోటో ఎగ్ రైస్ రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి గా సర్వ్ చేయాలి.

English summary

Chinese Tomato Egg Rice Recipe | చైనీస్ స్టైల్ టమోటో ఎగ్ రైస్ రిసిపి

Tomatoes when combined with eggs can bring up a wholeheartedly relished dish. Chinese tomato egg rice is one such dish that promises to be healthy and at the same time is extremely easy to prepare. It is a spicy recipe that can be relished for anytime of the day be it breakfast, lunch or dinner.
Desktop Bottom Promotion