For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ పనీర్ చికెన్ గ్రేవీ రిసిపి: టేస్టీ డిష్

|

పనీర్ అండ్ చికెన్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేసన్ లో రుచి చాలా డిఫరెంట్ గా టేస్ట్ గా ఉంటుంది . ఈ వండర్ ఫుల్ కాంబినేషన్ ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.

కాబట్టి, ఈ రోజు ఈ వండర్ ఫుల్ కాంబినేషన్ లో స్పైసీ పన్నీర్ చికెన్ కర్రీ రిసిపిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...సాఫ్ట్ గా ఉండే పనీర్ అండ్ చికెన్ కు వివిధ రకాల మసాలాలు జోడించడంతో స్పైసీ టేస్ట్ వస్తుంది . నిమ్మరసంతో ట్యాంగీ టేస్ట్ తో గ్రేవీ నోరూరిస్తుంటుంది . టేస్ట్ మాత్రమే కాదు, ఈ గ్రేవీలో అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది డైరీ ప్రొడక్ట్స్ మరియు క్యాల్షియం కూడా అధికమే . మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాంబినేషన్ చికెన్ పన్నీర్ గ్రేవీని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Easy And Spicy Paneer Chicken Gravy Recipe


కావల్సిన పదార్థాలు:
చికెన్ - 1/2 kg
పన్నీర్ - 100 g
టమోటో గుజ్జు - 1/2 cup
ఉల్లిపాయ గుజ్జు - 1/2 cup
ఉల్లిపాయలు - 1/2 cup
గరం మసాలా - 2 tsp
కారం - 1 tsp
ధనియాల పొడి - 1/2 tsp
పచ్చిమిర్చి- 7 to 8
ఆవాలు: - 1/4th tsp
నూనె: తగినంత
నిమ్మరసం - 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకొన్న పనీర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి . బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మరో పాన్ తీసుకొన అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తరవ్ాత అందులో ఆవాలు వేయాలి.

3. తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

4. పచ్చివాసన పోయే వరకూ వేగించి తర్వాత అందులో టమోటో, ఉల్లిపాయ గుజ్జు, గరం మసాలా , రెడ్ చిల్లీ పౌడర్, మరియు ధనియాల పొడి వేసి ఫ్రై చేయాలి.

5. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పన్నీర్ వేయాలి.

6. వెంటనే చిన్న గా కట్ చేసుకొన్ని చికెన్ ముక్కలు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

7. రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి పైన నిమ్మరసం చిలకరించాలి.

8. అంతే హాట్ అండ్ స్పైసీ పన్నీర్ గ్రేవీ రిసిపి రెడీ..

English summary

Easy And Spicy Paneer Chicken Gravy Recipe

When panner and chicken are combined together, you can surely get to have something different. Yes, those of you who would have tried this wonderful combination will definitely agree to it.
Story first published: Friday, January 22, 2016, 17:35 [IST]
Desktop Bottom Promotion