For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రా స్పెషల్.. !! గోంగూర.. వేటమాంసం..!!

|

Gongura Mutton
అసలే వానాకాలం.. ఆ పై చల్లగాలి.. ఈ శీతల వాతావరణంలో వేడి వేడి రుచులను ఆస్వాధిస్తుంటే భలే మజా అనిపిస్తుంది కదండి..!! 'గోంగూరు' ఈ రుచి తెలియని తెలుగు వారు ఉండరు.. ఆంధ్రా గోంగూర వంటకానికి పెట్టింది పేరు.. గోంగూరతో చేసే ప్రతి వంటకం ఘుమ, ఘుమలాడుతూ మంచి రుచిని కలిగి ఉంటుంది. గోంగూరకు వేట మాంసాన్ని జోడిస్తే ఆ రుచే వేరు.. మాంసాహార ప్రియులకు ఈ వంటంకం మరింత రుచిని పంచుతుంది. గోంగూర వేటమాంసం తయారీకి కావల్సిన పదార్థాలు, తయరు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం..

కావల్సిన పదర్థాలు :
లేత వేటమాంసం (తాజాది) - అరకిలో .
ఉప్పు - తగినంత.
పసుపు - అర టీ స్పూన్.
వెల్లుల్లి రేకలు - పది అంతుకు మించి.
అల్లం - తగినంత.
నూనె - 3 టీస్పూన్లు అంతకు మించి.
లవంగాలు - 4 అంతకు మించి.
యాలకులు - 4 అంతకు మించి.
దాల్చిన చెక్క - తగినంత.
బే ఆకులు - తగినన్ని.
గోంగూరు - 200 గ్రాములు.
పచ్చిమిర్చి - తగినన్ని.
ఉల్లిపాయ - ఒకటి అంతకు మించి.
కరివే పాకు - తగినంత.

తయారు చేసే విధానం:
- శుభ్రం చేసిన ముటన్ ముక్కలకు, కొద్దిగా అల్లం, వెల్లులి, ఉప్పును జోడించి ప్రెజర్ కుక్కర్ లో ఉడికించాలి.
- మూకుడులో నూనెను పోసి వేడిచేసిన తరువాత అందులో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బే ఆకులను వేయాలి, తరువాత అల్లం, వెల్లులి ఫేస్ట్, పచ్చిమిరిపకాయలు, ఉల్లిముక్కలను వేసి వేయించాలి.
- ఆ తరువాత మూకుడులో గోంగూర, కరివేపాక, పుసుపులను వేసి నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి.
- చివర్లో మాంసపు ముక్కలన గోంగూర మిశ్రమంలో కలిపి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించాలి. అనంతరం తగినన్ని నీళ్లు పోసి కూర చిక్కబడేదాక స్టవ్ ఆఫ్ చేయకండి.
- వేడి వేడిగా తయారైన 'గోంగూర వేట మాంసం' కూరకు కొత్తిమీర, ఉల్లిపాయలతో అలంకరణ చేసి సర్వ్ చేయండి..!!

English summary

Gongura Mutton..!! | కలిపి కొడితే ఎమ జోరు..!!

When one talks of Andhra food, the first thing they would say, ‘Spicy’. Honestly, its not as spicy as its made out to be. But then if they were to eat Gongura Mamsam, An authentic Andhra non-vegetarian meal is incomplete without Gongura Mamsam, an absolutely delectable, mouth-watering dish.
Story first published:Friday, August 12, 2011, 11:14 [IST]
Desktop Bottom Promotion