For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ: వీకెండ్ స్పెషల్

|

స్పెషల్ బిర్యానీ డిష్ లలో మొఘలాయ్ మటన్ బిర్యానీ ఒకటి. మొఘల్ కాలం నాటి రాయల్ ఫ్యామీలీ నుండి వచ్చిన ఈ మొఘలాయ్ బిర్యానీ ను ఇండియన్స్ తమదైన స్టైల్లో వండుతున్నారు. మొఘలాయ్ మటన్ బిర్యానీ ఒక టేస్టీ రైస్ డిస్. అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. ఒక్క సారి తింటే చాలు ఈ టేస్ట్ ను మరవలేరు. మొఘలాయ్ వంటలు హైదరాబాద్ లో చాలా ఫేమస్. నవాబుల కాలం నుండి ఈ వంటలకు ఒక ప్రత్యేకత ఉంది

ఈ పాపులర్ మొఘలాయ్ మటన్ బిర్యానినీ రెడ్ మీట్ తో తయారు చేస్తారు. ఇది రుచి మాత్రమే కాదు, ప్రోటీనులు మరియు శక్తి అందించే ఒక టేస్టీ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు. ఈ మొఘలాయ్ బిర్యానీని వండే విధానంలో చాలా సులభం మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. ఈ బిర్యానీకి కొన్ని ప్రత్యేమైన ఇండియన్ మసాలా దినుసులు ఉపయోగిస్తారు. ఈ మొఘలాయ్ వంటకం చాలా రిచ్ అనిపిస్తుంది. మరీ మీరు టేస్ట్ చేయాంటే ఈ మొఘలాయ్ రిసిపిని ట్రై చేయండి....

Mughlai Biryani Badshahi

కావలసిన పదార్థాలు:
మటన్: అర కేజీ
బాస్మతి బియ్యం: పావు కేజీ
నిమ్మరసం: 3 టేబుల్ స్పూన్లు
బాదం పప్పుల తరుగు: 2 టేబుల్ స్పూన్లు
పుదీనా ఆకులు: 10
బటర్: కప్పు
కొత్తిమీర: కొద్దిగా
జీలకర్ర: అర టేబుల్ స్పూను
ఉల్లి తరుగు: అర కప్పు
ఏలకులు: 2
నూనె: టేబుల్ స్పూను
వెల్లుల్లి రేకలు: 2
అల్లం ముక్క: చిన్నది
కుంకుమ పువ్వు: అర టేబుల్ స్పూను
పచ్చి మిర్చి తరుగు: అర టేబుల్ స్పూను
కారం: అర టేబుల్ స్పూను
దాల్చిన చెక్క: చిన్న ముక్క
పెరుగు: అర కేజీ
పాలు: 125 మి.లీ
నీళ్లు: 3 కప్పులు

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి.
3. అంతలోపు కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి.
4. తర్వాత అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
5. పాన్ లో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి.
6. సరిపడా నీళ్లు పోసి బాగా ఉడికించాలి. (సుమారు ఒక కప్పు గ్రేవీ ఉండేవరకు ఉడికించాలి).
7. తర్వాత ఒక పెద్ద పాత్రలో నీళ్లలో ఉప్పు, బియ్యం వేసి ఉడికించాలి.
8. పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి ఉన్న నీరంతా పోయేలా పిండేయాలి.
9. తర్వాత లవంగాలు, ఏలకులు, జీలకర్ర, పుదీనా, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర పెరుగులో వేసి కలపాలి.
10. కుంకుమ పువ్వు నీరు, నిమ్మరసం రెండింటినీ మటన్‌లో వేసి కలపాలి.
11. సగం అన్నాన్ని మటన్ మీద వేసి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసి మళ్లీ పైన అన్నం వేయాలి.
12. పాలు, కొద్దిగా పెరుగు వేసి మూత ఉంచాలి. సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి. వేడివేడిగా వడ్డించాలి.

Story first published: Saturday, October 11, 2014, 14:45 [IST]
Desktop Bottom Promotion