ఒక్క రోజులో పెట్టుకునే ఊర మిరపకాయలు..ఇలా చేస్తే ఏడాదైనా నిల్వ ఉంటాయ్

Posted By:

పప్పుచారు,పప్పు అన్నం, సాంబారులో సైడ్ డిష్ గా ఊరమిరపకాయలు సూపర్ గా ఉంటాయి.వీటిని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయి. మన తెలుగు సంప్రదాయ వంటకాల్లో ఊరమిరపకాయ కూడా ఒకటి. వీటిని వాము మిరపకాయ,చల్ల మిరపకాయ అని కూడా అంటారు. అయితే చల్ల మిరపకాయలను పెరుగులో నానబెట్టుకుని ఐదు రోజుల పాటు ఊరబెట్టుకుంటారు. ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్. అయితే అసలు పెరుగు,మజ్జిగ లేకుండా కేవలం ఒక్కరోజులోనే చల్ల మిరపకాయలను ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

ఊర మిరపకాయలు తయారీకి కావల్సిన పదార్థాలు
మిరపకాయలు
ఆయిల్
వాము
ఉప్పు
నిమ్మకాయ రసం

ఊర మిరపకాయలు తయారీ విధానం

-ముందుగా 30 గ్రాముల వాముని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోండి.
-ఇప్పుడు కారం తక్కువ ఉండే లావాటి అరకిలో పచ్చిమిర్చి ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-వీటిని తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగి జాలు గిన్నెలో వేసి..నీళ్లు పోయిన తర్వాత ఓ క్లాత్ పై పెట్టి ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి.
-ఇప్పుడు మిరపకాయల తొడిమలు తీసి మధ్యలోకి రెండుగా కట్ చేసి వెడల్పాటి ప్లేట్ లో వేసుకోండి.
-ఇప్పుడు వాము పొడి,50 గ్రాముల ఉప్పు,1 మీడియంసైజు నిమ్మాకాయ రసం పిండి మిరపకాయలలో వేసి మిర్చీకి బాగా పట్టేలా కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలి.
-గంట తర్వాత ఈ మిర్చిని ఓ గిన్నెలో వేసి గంటతో కొంచెం అదిమి తర్వాత మూతపెట్టి ఒక రోజుంతా అలాగే ఉండనివ్వండి. ప్రతి 8 గంటలకొకసారి మూత తీసి మిరపకాలు కలుపుకొని గంటతో నొక్కిపట్టిన తర్వాత మూత పెట్టేయండి.
-24 గంటల తర్వాత అంటే ఒక రోజు తర్వాత ఓ కాటన్ క్లాత్ ని ఎండలో పరిచి దాని మీద ఈ మిరపకాయలను పలుచగా స్ప్రెడ్ చేసుకొని అవి కరకరలాడేవరకు ఎండబెట్టుకోవాలి.
-ఇవి బాగా ఎండటానికి రెండు మూడు రోజులు పడుతుంది.పగలు అంతా ఎండబెట్టి సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్లీ మరుసటి ోజు ఎండ రాగానే ఎండలో పెడుతూ అలా ఎండబెట్టుకోవాలి.
-అవి కరకరలాడేంత వరకు ఎండితే చాలు. సంవత్సరం పైనే ఇవి పాడవకుండా నిల్వ ఉంటాయి.
-వీటిని తినాలనుకున్నప్పుడు నూనెలో ఎర్రగా వేయించుకొని పప్పు చారు,పప్పులో లేదా మరేదైనా కూరలో కలుపుకోని తింటే అదిరిపోతుంది. వీటిని వాము మిరపకాయలు అని కూడా అంటారు.

[ of 5 - Users]
Story first published: Thursday, December 5, 2024, 13:58 [IST]
Desktop Bottom Promotion