Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
కురుక్షేత్ర యుద్ధం: మహాభారతంలోని కీలక ఘట్టాలు, అర్జునుడు, కర్ణుడి కథలు వెల్లడి -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
Palak Khichdi: పాలకూర కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యం కూడా.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్స్‌తో పాటు మినరల్స్, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీనిని తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాంటి పాలకూరతో కిచిడి చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ కిచిడీని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వారికి కూడా పోషకాహారం లభించినట్లు అవుతుంది. అయితే ఈ పాలకూర కిచిడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాలకూర కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
- మూడు మీడియం సైజ్ పాలకూర కట్టలు
- ఒక కప్పు బియ్యం
- ఒక కప్పు పెసర పప్పు
- రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి
- ఒక టేబుల్ స్పూన్ పసుపు
- ఒక టేబుల్ స్పూన్ నూనె
- సన్నగా తరిగిన మూడు వెల్లుల్లి రెబ్బలు
- రెండు ఎండుమిర్చి
- సన్నగా తరిగిన మూడు పచ్చి మిర్చి
- ఒక టీస్పూన్ జీలకర్ర
- టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు
- గుప్పెడు కరివేపాకులు
- మూడు కప్పుల నీరు
- రుచికి సరిపడా ఉప్పు
పాలకూర కిచిడీ తయారీ విధానం
ఈ పాలకూర కిచిడీ తయారు చేసుకోవడానికి ఒక అరగంట ముందు ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెసర పప్పును వేరు నానబెట్టుకోవాలి. అలాగే పాలకూర ఆకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌లో బియ్యం, పెసరపప్పు, రెండు కప్పుల నీరు, చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి, నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులోనే రెండు ఎండుమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి గోల్డెన్ కలర్‌లో మారిన తరువాత అందులో ఉల్లిపాయ తరుగు ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక అందులోనే కరివేపాకులను కూడా వేసుకోవాలి.
ఇప్పుడు అందులో పాలకూర పేస్ట్‌ను వేసుకోవాలి. ఆ తరువాత అందులోనే పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి. ఆ తరువాత పాలకూర మిశ్రమంలో ఉడికించుకున్న అన్నం, పెసరపప్పు ముద్దను కూడా వేసుకోవాలి. అందులో అరకప్పు వేడి నీరు పోసుకొని, మీడియం మంట మీద కాసేపు ఉడికించుకోవాలి. కిచిడి కాసేపు ఉడికిన తరువాత దానిపై ఒక టీస్పూన్ నెయ్యి పోసుకొని.. ఇంకో నిమిషం పాటు ఉడికించుకుని దించుకుంటే పాలకూర కిచిడి సిద్ధమైనట్లే. ఇది ఎంతో రుచికరంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












