Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మిగిలిన అన్నంతో 10 నిమిషాల్లోనే మెత్తని పూరీలు..ఆంధ్రా స్పెషల్ కూరతో తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే
ఇళ్లల్లో అన్నం మిగిలిపోవడం అనేది సర్వసాధారణం. చాలామంది ఈ మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తుంటారు లేదా చద్దన్నంగా తింటుంటారు. మరికొందరు అయితే రుచికరమన పకోడీ, వడలు వంటివి కూడా తయారుచేస్తుంటారు. అయితే మిగిలిపోయిన అన్నాన్ని ఉపయోగించి ఎంతో రుచికరమైన పూరీలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్స్ కాకుండా మిగిలిపోయిన అన్నంతో పూరీలు చేయడం వల్ల ఆహారంలో వైవిధ్యాన్ని తీసుకురావచ్చు. మిగిలిపోయిన అన్నంతో చేసే పూరీలు..సాధారణ పూరీలకు భిన్నమైన రుచిని, మెత్తదనాన్ని అందిస్తుంది.
టేస్ట్ అద్భుతంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు, ఇది ఆహారాన్ని వృథా చేయకుండా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అన్నం ఇప్పటికే ఉడికినందున పిండి కలపడం, వేయించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇది పొద్దున్నే బ్రేక్ ఫాస్గ్ గా అయినా లేదా అకస్మాత్తుగా వచ్చే అతిథులకు త్వరగా సిద్ధం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంతో పూరీలు ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
మిగిలిపోయిన అన్నంతో పూరీ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-అన్నం
-ఆయిల్
-ఉప్పు
-గోధుమ పిండి
మిగిలిపోయిన అన్నంతో పూరీ తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలొ 1 కప్పు మిగిలిపోయిన అన్నం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన అన్నం మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే అన్నం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు గోధుమ పిండి వేయండి..కొద్దిగా ఉప్పు,2 టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తం కలిసేలా కలుపుకోండి. మిశ్రమం కొంచెం గట్టిగా ఉండేలానే కలుపుకోవాలి.
-కలిపిన మిశ్రమన్ని పావు గంట సేపు పక్కన ఉంచేయాలి.
-తర్వాత కలిపిన పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని పూరీ కర్రతో వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో పూరీలను వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూరీను అందులో వేసి గరిటతో ఆయిల్ ని దానిమీదకు నెడుతూ మంచిగా పొంగనిచ్చి దించేయాలి.
-ఓ ప్లేట్ లో టిష్యూ పేపర్లు పెట్టి దానిమీద పూరీలను వేయండి. దీంతో అది అదనపు నూనెను పీల్చుకుటుంది. అంతే మిగిలిపోయిన అన్నంతో టేస్టీ పూరీ రెడీ.
-దీనిని ఆంధ్రా స్టైల్ పూరీ కురతో తిన్నా, తెలంగాణ స్టైల్ పూరీ కూరతో తిన్నా నోటికి స్వర్గమే. కొంతమందికి, ముఖ్యంగా పెద్దలకు చద్దన్నం లేదా పులిసిన అన్నం జీర్ణక్రియకు మంచిదని చెబుతారు. మిగిలిపోయిన అన్నాన్ని పూరీలలో ఉపయోగించడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











