Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నూనె లేని స్నాక్..ఆరోగ్యం ప్లస్ రుచి.. 5 నిమిషాల్లోనే బీట్ రూట్ క్యారెట్ శాండ్ విచ్
శీతాకాలం వచ్చిందంటే చాలు.. సాయంత్రం వేళ చల్లని గాలికి ఏదైనా వేడివేడిగా, కరకరలాడుతూ తినాలనిపిస్తుంది. కానీ నూనెలో వేయించిన చిరుతిళ్లు తింటే ఆరోగ్యం పాడవుతుందన్న భయం వెంటాడుతోందా? అయితే కేవలం 5 నిమిషాల్లో అందుబాటులో ఉండే కూరగాయలతో బీట్ రూట్ క్యారెట్ శాండ్ విచ్ చేసుకోండి.
బీట్ రూట్ క్యారెట్ శాండ్ విచ్ మీ ఆకలిని తీర్చడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పిల్లలు కూరగాయలు తినమని మారాం చేస్తుంటే, ఈ క్రీమీ శాండ్ విచ్ చేసి పెట్టండి, ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. బీట్ రూట్ క్యారెట్ శాండ్ విచ్ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు
తురిమిన బీట్రూట్ - 1 కప్పు
తురిమిన క్యారెట్ - 1 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
మయోన్నైస్ లేదా గట్టి పెరుగు- 3 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
వెన్న - కాల్చడానికి సరిపడా
తయారీ విధానం
-ఒక వెడల్పాటి గిన్నెలో తురిమిన బీట్ రూట్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు వేయండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం వేసి బాగా కలపండి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో మయోన్నైస్ లేదా గట్టి పెరుగును వేసి బాగా కలపండి. ఇది శాండ్ విచ్ కి మంచి క్రీమీ ఆకృతిని ఇస్తుంది.
-బ్రెడ్ ముక్కలకు ఒక వైపు వెన్న రాయండి. వెన్న రాసిన వైపు కాకుండా, మరోవైపున తయారు చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని మందంగా పరచండి. మరో బ్రెడ్ ముక్కతో దానిని కవర్ చేయండి.
-స్టవ్ మీద పాన్ పెట్టి లేదా శాండ్ విచ్ మేకర్ లో బ్రెడ్ ముక్కలను ఉంచండి. రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వెన్న లేదా నెయ్యితో కాల్చుకోండి. బీట్ రూట్ క్యారెట్ శాండ్ విచ్ రెడీ.
-బీట్ రూట్, క్యారెట్ లను పచ్చిగా వాడటం వల్ల పోషకాలు పూర్తిగా అందుతాయి. కానీ పచ్చి వాసన నచ్చని వారు ఈ తురుమును ఒక్క నిమిషం పాటు నెయ్యిలో వేయించి వాడుకోవచ్చు.-
-బీట్ రూట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. క్యారెట్ లో ఉండే విటమిన్-ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రెండు కూరగాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వాటిని తట్టుకునేలా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












