Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
ఇవి తింటే కొండంత బలం..వినాయకుడికి కూడా ఇష్టమైన వంటకం..ఎలా చేసుకోవాలంటే
రాగి లేదా మిల్లెట్.. మన పూర్వీకులు తరచుగా తమ ఆహారంలో ఉపయోగించే ఒక శక్తివంతమైన ధాన్యం. ఇది కేవలం రుచిలో మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజుల్లో రాగిని మళ్లీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మారింది. రాగి పిండితో చేసే కుడుములు లేదా కజ్జికాయలు ఒక అద్భుతమైన అల్పాహారం లేదా స్నాక్ గా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఐరన్, కాల్షియం, పొటాషియం అందించి ఎముకల బలాన్ని పెంచి రక్తహీనతను పొగొడతాయి.
ఇవి పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు కూడా సరైనవి. వినాయకచవితి రోజున స్వామికి నైవేద్యంగా కూడా వీటిని సమర్పిస్తారు. పండుగలకే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని తయారుచేసుకుని ఆస్వాదించండి. రాగి కుడుములు ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగికుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగిపిండి
-బెల్లం
-ఉప్పు
-నెయ్యి
-వేయించిన నువ్వులు
-వేయించిన పల్లీలు
-జీడిపప్పు
-పచ్చి కొబ్బరి తురుము
-వేయించిన శెనగపప్పు
రాగి కుడుములు తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో అర కప్పు వేయించిన నువ్వులు, వేయించి పొట్టు తీసిన అరకప్పు పల్లీలు, వేయించిన శెనగపప్పు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసి అందులో గ్రైండ్ చేసిన పొడిని, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 2 కప్పుల బెల్లం తురుము వేసి తక్కువ మంట మీద 5 నిమిషాలు వేయించుకోవాలి.
-బెల్లం కరిగి కాస్త ముద్దయ్యాక అందులో1 టేబుల్ స్పూన్ నెయ్యి, వేయించిన జీడిపప్పు,గసగసాలు వేసి కలిపి మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో 1కప్పు నీళ్లు పోసి వేడి చేసి అందులో 1 స్పూన్ బెల్లం, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక అందులో 1కప్పు రాగిపిండి వేసి తక్కువ మంటమీద కలుపుతూ 2 నిమిషాలు ఉడికించాలి.
-పిండి ఉండలు కట్టకుండా ఒక చెక్క గరిటెతో వేగంగా కలుపుతూ ఉండాలి. పిండి అంతా నీళ్లను పీల్చుకుని ఒక ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆపేయాలి.
-ఉడికించిన మిశ్రమం చల్లారాకా దానిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆ బాల్స్ ను కజ్జికాయల్లా వత్తుకొని దాని మధ్యలో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నువ్వులు,కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం మధ్యలో పెట్టాలి. దాని అంచులను జాగ్రత్తగా మూసి,కుడుము ఆకారం (ముద్ద ఆకారం) లేదా కజ్జికాయ ఆకారం (అర్ధచంద్రాకారం) ఇవ్వాలి.
-అన్నింటిని ఇలాగే తయారుచేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
- తర్వాత వీటన్నింటిని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి. అంతే రాగి కుడుములు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











