Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కూరగాయలే అవసరం లేని రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు..నాకి నాకి తింటారు, ఎలా చేసుకోవాలో చూడండి
రాయలసీమ అంటే చాలామందికి అక్కడివాళ్లు చేసే మర్యాదలు, ఫ్యాక్షన్ వంటివి మనసులో మెదలుతూ ఉంటాయి. ఇప్పుడైతే అక్కడ ఫ్యాక్షన్ కనుమరుగైందని చెప్పొచ్చు. రాయలసీమ అంటే వంటలకు కూడా చాలా చాలా ఫేమస్. రాయలసీమలో పుట్టినవాళ్లకి మిగతా ప్రాంతం వాళ్లకన్నా కొంచెం ఎక్కువగానే పౌరుషం ఉంటుందని సహజంగా అంటుంటారు. అయితే చాలామంది సీమ ప్రజలు దీనికి తాము తినే ఫుడ్ కారణమని కూడా చెబుతుంటారు. రాయలసీమలో చాలామంది తరుచుగా తినే ఎండుమిర్చి పప్పు మీరెప్పుడైనా తిన్నారా? తినకపోతే ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే.
అన్నం లేదా జొన్న రొట్టెలలో రాయలసీమ స్టైల్ లో తయారుచేసే ఎండుమిర్చి పప్పుని కలుపుకుని తింటుంటే స్వర్గమే. రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఎండుమిర్చి పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
-ఆయిల్
-కందిపప్పు
-చింతపండు
-ఉల్లిపాయ
-ఎండుమిర్చి
-ఆవాలు
-ధనియాలు
-వెల్లుల్లి
-శెనగపప్పు
-మినపప్పు
-జీలకర్ర
-పసుపు
-చింతపండు
-కరివేపాకు
-కొత్తిమీర
గార్లిక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా? క్షణాల్లో రెడీ, ముద్ద ముద్దలో మజా వస్తుంది,ఎలా చేయాలంటే
ఎండుమిర్చి పప్పు తయారీ విధానం
-ముందుగా కుక్కర్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో అరకప్పు కండిపప్పు వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించండి.
-తర్వాత అందులో 1 ఉల్లిపాయ తరుగు, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, 10-12 కారంగా ఉండే ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించండి.
-కొద్దిగా ఉల్లిపాయలు,ఎండుమిర్చి వేగినత తర్వాత అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటమీద 5 విజిల్స్ వచ్చేదాకా ఆగండి.
-తర్వాత మూతతీసి దానిని పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేడి చేసి అందులో పావు చెంచా మెంతులు వేసి ఎర్రగా వేయించాలి.
-మెంతులు వేగి తర్వాత అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ నలిపిన ధనియాలు, 5 కచ్చిపచ్చిగా దంచిన వెల్లుల్లి, 1 టీస్పూన్ శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి తాళింపు ఎర్రగా వేపుకోవాలి.
-తర్వాత మెత్తగా మాష్ చేసిన పప్పుని తాళింపు బాండీలో వేసుకొని,ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి దించుకోవడమే. అంతే ఎండుమిర్చి పప్పు రెడీ. పప్పు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్లు కలుపుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












