ఆల్ టైం ఫెవరెట్ చికెన్ లాలీపాప్,రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్‌గా ఇలా చేసుకోండి

రెస్టారెంట్‌లకు వెళ్తే కచ్చితంగా ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా అడిగేది చికెన్ లాలీపాప్. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కానీ దీనిని చేసుకోవడం మాత్రం ఎవరికీ రాదు. అలాంటి వారికోసమే ఈ స్టోరీ. ఈ కథనంలో మేము రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ లాలీపాప్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో వివరించాము. ఈ స్టోరీని పూర్తిగా చదివి, మీ ఇంట్లోనే చికెన్ లాలీపాప్‌ను సులభంగా చేసుకోండి.

చికెన్ లాలీపాప్ తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ ముక్కలు (డ్రమ్‌స్టిక్స్ లేదా వింగ్స్)
వెల్లుల్లి రెబ్బలు
ఇంజు
పసుపు
కారం పొడి
గరం మసాలా
కొత్తిమీర
ఉప్పు
మిరియాల పొడి
సోయా సాస్
వినెగర్
కార్న్ ఫ్లోర్
బ్రెడ్ క్రంబ్స్
వేయించడానికి సరిపడా నూనె

చికెన్ లాలీపాప్ తయారీ విధానం:

ఈ చికెన్ లాలీపాప్ తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ చికెన్‌లో వెల్లుల్లి, ఇంజు రెబ్బలు, పసుపు, కారం పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వినెగర్ కలిపి మెరినేట్ చేసుకోవాలి. ఇలా మెరినేట్ చేసుకున్న తరువాత ఆ చికెన్‌ను కనీసం 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో కలిపి మృదువైన బ్యాటర్ తయారు చేసుకోండి. అలాగే బ్రెడ్ కృంబ్స్‌ తయారు చేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్ చేసి.. ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో చికెన్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి.

నూనె బాగా వేడైన తరువాత మెరినేట్ చేసిన చికెన్ ముక్కలను ముందుగా బ్యాటర్‌లో ముంచి, ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్‌లో రోల్ చేసి, వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆ తరువాత వేడి వేడి లాలీపాప్‌లను టమాటో సాస్ లేదా చిలి సాస్‌తో సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్ సిద్ధమైనట్లే.

[ of 5 - Users]
Story first published: Sunday, January 26, 2025, 11:12 [IST]
Desktop Bottom Promotion