ఫిట్ నెస్ కోరుకునేవారికి పర్ఫెక్ట్..సారా టెండూల్కర్ చెప్పిన ప్రొటీన్ కాఫీ..వీడియో చూడండి

Posted By:

సచిన్ టెండూల్కర్..ఈ పేరు వింటేనే కొందరికి పూనకాలు వస్తాయి. క్రికెట్ అంటే సచిన్..సచిన్ అంటే క్రికెట్ అనే స్థాయికి ఆయన ఎదిగారు. క్రికెట్ వరల్డ్ లో అందనంత ఎత్తుకు ఎదిగిన ఆయనను క్రికెట్ దేవుడిగా అభిమానులు చూస్తారు. మరోవైపు, సచిన్ గారాల పట్టి సారా టెండూల్కర్‌ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తన అందం, అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్, ఫిట్‌ నెస్‌ తో యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. గ్లామర్ ఫోటోలే కాకుండా తన వర్కౌట్ వీడియోలు, డైట్ చిట్కాలను కూడా ఆమె తరచుగా అభిమానులతో షేర్ చేసుకుంటుంటది. తాజాగా సారా.. తన అభిమానుల కోసం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది.

సాధారణంగా మనం ఉదయం లేవగానే లేదా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ తాగుతుంటాం. ఇది మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ సారా తాగేది మామూలు కాఫీ కాదు, అది ప్రోటీన్ కాఫీ. రుచితో పాటు ఆరోగ్యాన్ని, కండరాలకు బలాన్ని ఇచ్చే ఈ కాఫీని ఎలా తయారు చేసుకోవాలో సారా స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వివరించింది.

ప్రోటీన్ ఎందుకు ముఖ్యం?
మన శరీర నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరం. ముఖ్యంగా ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టే వారికి ఇది చాలా కీలకం. బలమైన కండరాల నిర్మాణానికి, వర్కౌట్స్ తర్వాత కండరాల నష్టాన్ని తగ్గించడానికి ప్రోటీన్ ఇంధనంలా పనిచేస్తుంది. \

అంతేకాకుండా, మనం రోజంతా చురుకుగా ఉండటానికి, చర్మం నిగనిగలాడాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా శరీరానికి తగినంత ప్రోటీన్ అందాలి. అందుకే సారా తన రెగ్యులర్ కాఫీలో ప్రోటీన్‌ ను భాగం చేసుకుంది.

ప్రొటీన్ కాఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు

చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ - 1 స్కూప్
కాఫీ డికాషన్ - అర కప్పు (వేడి నీటిలో కలిపింది)
కోకో పౌడర్ (చక్కెర లేనిది) - 1 టేబుల్ స్పూన్
చియా విత్తనాలు - అర టేబుల్ స్పూన్ (ముందుగా నీటిలో నానబెట్టినవి)
బాదం పాలు - అర కప్పు
ఐస్ క్యూబ్స్ - 3 నుంచి 4

తయారీ విధానం

-ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఒక స్కూప్ చాక్లెట్ ప్రోటీన్ పౌడర్,ఐస్ క్యూబ్స్, కోకో పౌడర్, నానబెట్టుకున్న చియా విత్తనాలు, కాఫీ డికాషన్‌, బాదం పాలు పోసి, అన్నింటినీ బాగా బ్లెండ్ చేయాలి.

-అంతే.. కొన్ని నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన, నురగలతో కూడిన ప్రోటీన్ కోల్డ్ కాఫీ రెడీ.

సారా పోషకాహార నిపుణురాలు కూడా

కేవలం సెలబ్రిటీ డాటర్‌గానే కాకుండా సారా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఆమె లండన్‌ లో మెడిసిన్ చదివింది, ఆమె ఒక ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ (పోషకాహార నిపుణురాలు) కూడా.

ఇటీవలే సారా.. సొంతంగా ఒక పైలేట్స్ స్టూడియోను స్టార్ట్ చేసింది. మరోవైపు, సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌ లో డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ సామాజిక సేవలోనూ ముందుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion