For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ రెష్మి కబాబ్-ఈవెనింగ్ స్నాక్

|

ఎప్పుడైనా మీరు స్ట్రీట్ ఫుడ్ ను ఇంట్లో తయారు చేశారా? గ్రిల్డ్ టిక్కా మరియు మౌత్ కబాబ్ లు చాలా రుచిగా నోరూరిస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి రెష్మి కబాబ్. ఈ రిసిపి చాలా ఫుడ్ జాయిట్స్ లో తాయారు చేస్తుంటారు. నాన్ వెజిటేరియన్స్ ఈ వంటను ఇంట్లో కూడా ప్రయత్నించవచ్చు.

దీనికి కావల్సిన వస్తువులన్నీ మన ఇంట్లో రెగ్యులర్ గా ఉపయోగించే వస్తులే కాబట్టి సులభంగా..ఈజీగా తయారు చేసేయవచ్చు. మరి మీరు ఒకసారి ప్రయత్నించి టేస్ట్ చూడండి...

Chicken Reshmi Kebab

చికెన్: 500grm(బోన్ లెస్ మరియు స్కిన్ లెస్)
నిమ్మరసం: 1tbsp
క్రీమ్: 1/2cup
పెరుగు: 1tbsp
బాదాం: 5-6
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
తాజా పుదీనా ఆకులు: 1/4cup
తాజా కొత్తిమీర : 1/4cup
పచ్చిమిర్చి: 4-5
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా బాదాంను గోరువెచ్చిని నీటిలో 10నిముషాల పాటు నానబెట్టుకోవాలి.
2. తర్వాత పుదీనా, కొత్తిమీరు వివిడి విడిగా శుభ్రం చేసుకోవాలి.
3. తర్వాత బాదాంను, కొత్తిమీర, పుదీనా మరియు పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగా పక్కన పెట్టుకోవాలి.
5. నిమ్మరసం, ఉప్పు, క్రీమ్, పెరుగును మిక్సింగ్ బౌల్ లో వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకొని చికెన్ ముక్కలకు పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
6. ఒక గంట తర్వాత, పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేయాలి.
7. మూత పెట్టకుండా చికెన్ ముక్కలను బాగా వేగించుకోవాలి. మీడియం మంట మీద చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
8. చికెన్ ఉడికించదని తెలియగానే స్టౌ ఆఫ్ చేసి మూత పెట్టి పది నిముషాల తర్వాత సర్వ్ చేయాలి.
9. ఈ కబాబ్ ను ఓవెన్ లో కూడా తయారు చేసుకోవచ్చు.

English summary

Chicken Reshmi Kebab | చికెన్ రెష్మి కబాబ్-ఈవెనింగ్ స్నాక్

Ever tried Indian street food? Nothing can taste more heavenly than the food served by the small food joints. The list of foods ranges from the hot steamed momos to the grilled tikkas and the mouth watering kebabs.
Story first published: Friday, May 17, 2013, 16:30 [IST]
Desktop Bottom Promotion