For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య ప్రదాయిని మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్

|

Dry Fruit Milkshake
నీరసంగా వుందా? అలసిపోయారా? డైటింగా? తక్షణ శక్తి అవసరమా? విటమిన్‌ 'ఎ' తో పాటు కాల్షియం కూడా అధికంగా కవాలా? తక్కువ తిన్నా ఎక్కువ పోషకాలు కావాలా? అయితే మీరు చేయవలసిందల్లా డ్రై ఫ్రూట్స్‌ని ఉపయోగించడమే..వీటిలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు (సహజ చక్కెర రూపంలో)తో పాటు పీచు పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటిలో'యాంటీ ఆక్సిడెంట్లు' పుష్కలంగా వుంటాయి.

విటమిన్‌ 'ఎ, బి1, బి2, బి6, పాంటోథెనిక ఆమ్లం' విరివిగా వుంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, కాపర్‌, మాంగనీస్‌ కూడా బాగా వుంటాయి. దాదాపు 60 నుండి 70 శాతం సహజ చక్కెరలు సులభంగా జీర్ణమయ్యే రూపంలో (గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌) వుండడం వలన అవి వెంటనే రక్తంలోకి వెళ్లి శక్తినిస్తాయి. మరి ఇక డ్రైఫ్రూట్ మిల్క్ షేక్ ఎలాతయారు చేయాలో తెలుసుకుందామా...

కావలసిన పదార్థాలు:
కర్జూరం: 1cup
అంజూర: 4(నీటిలో నానబెట్టినవి)
బాదం: 1/2cup(నీటిలో నానబెట్టినవి)
పిస్తా: 1/2cup
జీడిపప్పు: 1/2cup
ఎండుద్రాక్ష: 1/4cup
చిక్కటి పాలు/వెన్నీలా ఐస్ క్రీ: 1cup
తేనె: 2-3tbsp
యాలకలు పౌడర్: 1/4tsp


తయారు చేయు విధానము:
1. ముందుగా బాదాం,జీడిపప్పు,కర్జూరం నాలుగు గంటలముందునానపెట్టుకోవాలి .
2. పాలు కాచి చల్లారనిచ్చి ఫ్రీజర్లో గంట సేపు ఉంచాలి.
3. నానిన పప్పులు పొట్టు తీసి మిక్సిలో మెత్తగా గ్రైండ్ చెయ్యాలి ,పాలు.పంచదార,మీగడ కలిపి మిక్సిచేస్తే మిల్క్ షేక్ రెడి

English summary

Dry Fruit Milkshake | ఆరోగ్య ప్రదాయిని మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్

We all want to stay healthy. In the quest of health we are looking for miraculous supplements beautifully packaged lining in the stores. But did you know that nature has offered us wonderful small packaging of minerals and vitamins along with their disease fighting ability in the form of nuts.
Story first published:Tuesday, September 20, 2011, 16:37 [IST]
Desktop Bottom Promotion