For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాపిల్స్ హల్వా

|

Grated Apple Halwa
కావలసిన పదార్థాలు:

తురిమిన యాపిల్స్ - 2cup
పంచదార - 1 cup
నెయ్యి - 1 tsp
జీడిపప్పు - 5
ద్రాక్ష - 5
సన్నగా తరిగిన బాదం - 1/2 cup
యాలకలు పొడి - 1/2 tsp

తయారు చేయు విధానం:

1. ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి వేడి చేయాలి.
2. అందులో తురిమిన ఆపిల్స్ వేసి కలిపి, మీడియం హీట్‌లో వేయించాలి. ఆపిల్స్‌లోని నీరంతా ఇంకిపోయి, బాగా ఉడికినట్లు అనిపించేదాకా అలాగే వేయించాలి.
3. ఓ పదినిమిషాలు ఉడికిన తరువాత దాంట్లో పంచదార కలపాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత, ద్రాక్ష, సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు కూడా వేసి కలియబెట్టాలి.
4. ఆ మిశ్రమం బాగా పొడిపొడిగా అయిన తరువాత అందులో యాలకలు పొడి వేసి కలపాలి. సన్నటి మంటమీద అలాగే ఉంచి, ఆ పదార్థం గట్టిపడేదాకా ఉడికించి దించేయాలి.
5. అంతే యాపిల్స్ హల్వా రెడీ ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే అతిథులకు సర్వ్ చేయండి.

Story first published:Monday, December 28, 2009, 17:41 [IST]
Desktop Bottom Promotion