For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్దీ ఈవినింగ్ స్నాక్-కార్న్ ప్లేక్ కుక్కీస్

|

Cornflakes Cookies
కార్న్ ఫ్లేక్స్ చాలా టేస్టీగా, లోఫాట్ ఈవెనింగ్ స్నాక్. సాయంసంద్యను ఎంజాయ్ చేయడానికి ఈ హెల్దీ కుక్కీస్ తో పాటు ఒక కప్పు టీ తో ఎంజాయ్ చేయవచ్చు..కార్న్ ఫ్లేక్ కుక్కీస్ ని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు...

కావలసిన పదార్థాలు:
మైదా: 1cup
కార్న్ ఫ్లేక్స్: 1cup
ఓట్స్: 1/4cup
పంచదార: 1cup
కొబ్బరి తురుము: 1/2cup
బాదం, ఎండు ద్రాక్ష: 1/2cup
వెన్న: 150grms
గ్రుడ్డు: 1
తేనె: 1tbsp

తయారు చేయు విధానము:
1. ఒక బౌల్ లో మైదా తీసుకొని అందులో పెరుగు, కార్న్ ప్లేక్స్, ఓట్స్, కొబ్బరి తురుము, పంచదార, కట్ చేసిన డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి.
2. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో తేనే, గ్రుడ్డు సొన వేసి బాగా గిలకొట్టాలి.
3. తర్వాత తేనే మిశ్రమాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకొన్న మైదా మిశ్రమంతో కలిపి చిక్కని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. ఇప్పుడు బేకింగ్ పాన్ తీసుకొని అందులో చిన్న చిన్న కుక్సీస్ లా పేస్ట్ ను అందులో అమర్చుకోవాలి. గుండ్రపు ఆకారంలో చేసుకుని క్రీస్ ఫ్రూఫ్ పేపర్లో పెట్టి రోల్‌ చేసి 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత ఈ మైక్రోవోవెన్ లో పెట్టి 10-15నిమిషాల పాటు 180డిగ్రీ సెంటీగ్రేడ్ లో బేక్ చేసి చల్లార్చి క్రీమ్, చాక్లెట్ జీడిపప్పులతో అలంకరించి సర్వ్ చేయండి...అంతే కార్న్ ఫ్లేక్స్ కుక్కీస్ రెడీ..

English summary

Healthy Evening Snack: Cornflakes Cookies | హెల్దీ ఈవినింగ్ స్నాక్-కార్న్ ప్లేక్ కుక్కీస్

Cornflakes Cookies are tasty, crunchy and crisp healthy snack with low fat. This evening snack recipe can be made easily and enjoyed with a cup of tea. Lets check out the cornflakes cookies recipe.
Story first published:Thursday, September 22, 2011, 15:12 [IST]
Desktop Bottom Promotion