For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ పకోడ: హెల్తీ ఈవెనింగ్ స్నాక్

|

చాలా మంది క్రిస్పీ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ఈవెనింగ్ అయ్యే సరికి ఒక కప్పు కాఫీతో పాటు, ఏదైనా వేడివేడి స్నాక్స్ తినాలని కోరుకుంటాం. అందులో క్రీస్పీగా ఉండేవి ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా ఈవెనింగ్ స్నాక్స్ చాలా మంది ఇష్టపడుతారు. సాయంత్ర సమయాల్లో టీ, కాఫీలతో పాటు తీసుకొనే వేడి వేడి స్నాక్స్ లో పకోడ కూడా ఒకటి అందులో హెల్తీ పకోడా పాలక్ పకోడా. పాలకు కూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషియన్స్ ను అందిస్తుంది. ఇది పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడి తింటారు.

ఇది గ్రీన్ చట్నీ లేదా టమోటో కెచప్ తో చాలా గ్రేట్ స్నాక్. ఇది చాలా సింపుల్ మరియు ఈజీ పాలక్ పకోడా. చాలా తక్కువ సమయంలో దీన్ని తయారుచేయవచ్చు. ఈ సింపుల్ స్నాక్ రిసిపిని శెనగపిండితో తయారుచేస్తారు. ఇందులో ఫ్రెష్ గా ఉండే పాలకూరతో తయారుచేస్తారు. అంతే కాదు, రుచికూడా అద్భుతంగా ఉంటుంది. ఈ స్నాక్ ను గ్రీన్ చట్నీ లేదా టమోటో కెచప్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Palak Pakora: Healthy Evening Snack
కావల్సిన పదార్థాలు:

పాలకూర: 1కట్ట
శెనగపిండి: 250grms
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అజ్వైన్: 1tsp(సోంపు)
జీలకర్ర: 1tbsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1cup
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాలకూరను విడిపించుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అజ్వైన్, జీలకర్ర, మరియు ఉప్పు వేయాలి.
3. అందులోనే సన్నగా తరిగి పెట్టుకొన్న పాలకూర కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా చిక్కగా పిండిని కలుపుకోవాలి . చిక్కగా జారుడుగా అయ్యే వరకూ కలుపుకోవాలి. సరిసరిచూపి కొద్దిగా జత చేసి కలుపుకోవచ్చు.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి, చేతిని నీటిలో ముంచి తడిచేసుకొని, శెనగపిండి, పాలక్ మిశ్రమాన్ని చేత్తో ఎత్తుకొని కొద్దికొద్దిగా చేత్తో కాగే నూనెలో విడవాలి .
4. పకోడాను నిధానంగా కాగేనూనెలో విడవాలి. ఎలా పడితే అలా వేస్తే నూనె చేతుల మీద ఎగిరే ప్రమాదం ఉంది .
5. పకోడాను అన్ని వైపులా కాలి, క్రిస్పీగా మరియు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. వేగిన తర్వాత వాటిని తీసి పేపర్ టవల్ మీద వేయాలి . అంతే పాలక్ పకోర రెడీ. కొత్తిమీర చట్నీ, టమోటో కెచప్ తో సర్వ్ చేయాలి. అలాగే మీరు చింతకాయ చట్నీ కూడా ట్రై చేయవచ్చు

English summary

Palak Pakora: Healthy Evening Snack

Here is a special Rakhi recipe to make palak pakora, a yummy evening snack. This dish is made with spinach (known as palak) that is coated with besan (Bengal gram flour). Treat your brother with this tasty snack.
Story first published: Tuesday, June 3, 2014, 18:04 [IST]
Desktop Bottom Promotion