For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్వీట్: ఈజీ పన్నీర్ గులాబ్ జామూన్

|

గులాబ్ జామున్ ఒక స్వీట్ డిష్ . ఇదంటే ప్రతి ఒక్కరికీ చిన్న పెద్ద అందరికీ ఇష్టమైన స్వీట్ డిష్ . బ్రౌన్ కలర్ యమ్మీ బాల్స్ ఎప్పుడూ నోరూరిస్తుంటుంది . ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్స్, ఇంట్లో శుభకార్యాలకు కూడా స్వీట్ జామ్ ను తయారుచేస్తుంటారు . అదే విధంగా ఈ రంజాన్ మాసంలో కూడా ఈ స్వీట్ డిష్ ను తయారుచేస్తారు. ఒక అద్బుతమైన రుచి మాత్రమే కాదు, ఇందులో న్యూట్రీషియన్స్ విలువలు కూడా ఎక్కువే..

READ MORE:ఖర్జూరం స్వీట్ హల్వా: రంజాన్ స్పెషల్

ఈ రుచికరమైన గులాబ్ జామూన్ ను ఇఫ్తార్ సమయంలో తీసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది మీ ఎనర్జిని..మంచి ఉల్లాసాన్ని కూడా అందిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామున్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Ramazan Sweet: Easy Paneer Gulab Jamun

కావల్సిన పదార్థాలు:
డ్రై మిల్క్ పౌడర్: 2 cup
రవ్వ: 2 Tsp

READ MORE: షీర్‌ కుర్మా: రంజాన్ స్పెషల్ ట్రీట్
గుడ్డు: 1
పనీర్ తురుము లేదా చీజ్: 1 cup
పంచదార: 1 cup
నీళ్లు: 2cups
బేకింగ్ సోడ: 1/4th tsp
నూనె: ఫ్రై చేయడానికి

Ramazan Sweet: Easy Paneer Gulab Jamun

తయారుచేయు విధానం:
1. ముందుగా నీళ్లలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి షుగర్ సిరఫ్ తయారయ్యే వరకూ చిక్కగా ఉడికించుకోవాలి.
2. తర్వాతగ ఒక మిక్సింగ్ బౌల్లో సూజి(రవ్వ), చీజ్ తురుము, పాలపొడి మరియు గుడ్డు వేసి మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ లా చేసుకోవాలి.
3. పది నిముషాలు పక్కన పెట్టి, అందులో నుండి కొద్దిగా కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Ramazan Sweet: Easy Paneer Gulab Jamun

4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి అయ్యాక అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో పనీర్ ఉండలు వేసి డీప్ ఫ్రై చేయాలి.
5. బ్రౌన్ కలర్ లో డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ముందుగా తయారుచేసి పెట్టుకొన్న షుగర్ సిరఫ్ లో వేసి డిప్ చేయాలి . అంతే స్వీట్ రిసిపి రెడీ. 15-30నిముషాలు బాగా సోక్ అయిన తర్వాత సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Ramazan Sweet: Easy Paneer Gulab Jamun: Telugu Vantalu

Gulab jamun is a sweet dish that is loved by both kids and elders. That brown coloured yummy balls are always a mouth watering dish especially in the month of ramazan.
Story first published: Tuesday, June 30, 2015, 15:07 [IST]
Desktop Bottom Promotion