For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైస్ కేసర్ ఖీర్

|

Rice Kesari Kheer
వేసవిలో మండే ఎండలు. ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాగే ఆకలి వేస్తున్నట్టుంటుంది, తినలేము. దప్పిక పెరిగిపోతుంటుంది, తాగలేము. నీరసం.... నీ...రసం. కొంచెం రిఫ్రెష్ బటన్ నొక్కి మనసును, శరీరాన్ని జిల్‌జిల్‌మనిపించేలా ఏదైనా తిని, తాగాలనిపిస్తుంది. అప్పుడు మీకు కావాలి కోల్డ్ రొమాన్స్ సలాడ్. మీ నోటికి అందాలి మామిడి జ్యూస్. ప్లేట్‌లో కేసర్ ఖీర్. కేసర్ ఖీర్ చూడటానికి కలర్ ఫుల్ గా తినడానికి రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. టేస్ట్ చేయండి.

కావలసిన పదార్థాలు:
బియ్యం: 100 గ్రా
జీడిపప్పు: 50 గ్రా
కిస్‌మిస్: 25 గ్రా
బిర్యానీ ఆకులు: 2
పంచదార: 100 గ్రా
పాలు: అర కప్పు
కుంకుమపువ్వు: గ్రాము
నెయ్యి: 50 గ్రా
పిస్తా: 25 గ్రా
బాదంపప్పు: 25
పచ్చికోవా: 50 గ్రా
నీరు: లీటరు

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి నీటిని ఒంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడయిన తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి తీసి పక్కన ఉంచాలి.
3. తర్వాత అదే గిన్నెలో బియ్యం వేసి వేయించాలి. బియ్యం వేగేటప్పుడు ఏలకులు వేయాలి. ఇవి వేగిన తరవాత నీటిని పోసి బిర్యానీ ఆకు వేసి ఉడికించాలి.
4. బియ్యం మిశ్రమం కొద్దిగా ఉడికిన తర్వాత పాలు, పంచదార, కుంకుమపువ్వు, పచ్చికోవా వేసి కలిపి సన్నమంట మీద ఉడకనివ్వాలి. పూర్తిగా ఉడికిన తర్వాత పైన జీడిపప్పు, బాదం, పిస్తాలతో అలంకరిస్తే కేసరిఖీర్ రెడీ.

English summary

Rice Kesari Kheer | రైస్ కేసర్ ఖీర్

This is very quick recipe to make healthy and delicious Kheer.One can enjoy as desert or offer as Prasadam. You will love Soft and chewy texture of Barley. This Kesari Kheer needs just simple ingredients and they taste delicious.
Story first published:Monday, May 7, 2012, 16:58 [IST]
Desktop Bottom Promotion