For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ ను షేక్ చేసే.. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్..!

|

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కంటే...ఏ ఎండకు ఆ షేక్స్ తాగడం బెటర్. షేక్స్‌తో ఎండలకు షాకివ్వవచ్చు. సమ్మర్‌ని షేక్ చేయవచ్చు. మిల్క్ షేక్‌లు కడుపును చల్లగా ఉంచుతాయి.
ఒంటికీ చలవ చేస్తాయి. పాలూ పండ్లతో ఒక షేక్. చాకో కోకోలతో ఇంకో షేక్. ఎండల్ని రుచికరంగా చల్లబరుచుకోండి. ఈ సమ్మర్‌ను వశపరుచుకోండి. ఇక ఈ స్ట్రాబెర్రీ పళ్లు కూడా విరివిగా లభిస్తున్నాయి. పిల్లలు అలాగే తినమంటే తినరు. ఎలా అనుకుంటూ పాలతో మిల్క్ షేక్ చేసిచ్చాను. పాలు, పళ్లు రెండు ఒకేసారి పిల్లలకు, పెద్దలకు కూడా ఇలా ఇవ్వొచ్చన్నమాట.

Strawberry Milkshake

కావల్సిన పదార్థాలు:

స్ట్రాబెర్రీ పొడి : రెండు టేబుల్‌ స్పూన్లు;
చల్లటిపాలు : రెండు కప్పులు;
స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌ : నాలుగు స్కూపులు;
పంచదార : రుచికి తగినంత;
తాజా స్ట్రాబెర్రీలు : ఆరు

తయారు చేయడం:
1. ముందుగా స్ట్రాబెర్రీలను కడగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత జార్‌లో పాలు, స్ట్రాబెర్రీ పొడి, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌, పంచదార వేసి మెత్తగా అయ్యేవరకు బ్లెండ్‌ చేయాలి.
3. తరువాత గ్లాసుల్లోకి పోసి, స్ట్రాబెర్రీలతో గార్నిష్‌ చేసి చల్లచల్లగా సర్వ్‌ చేయాలి.
4. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ స్ట్రాబెరీ మిల్క్ షేక్ ను ఈ వేసవిలో తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు.
5. ఈ వేసవిలో బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే చాలా సులభంగా ఈ విధంగా చేసి సర్వ్‌ చేయచ్చు.

English summary

Strawberry Milkshake | సమ్మర్ ను షేక్ చేసే.. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్..!

This old fashioned milkshake made with ice cream and fresh strawberries is great on a hot summer day! A tasty and a delicious strawberry milk shake topped with whipped cream.
Story first published: Monday, April 29, 2013, 17:12 [IST]
Desktop Bottom Promotion