For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో మాంగో కుల్ఫీతో మజా...

|

Mango Kulfi
ఎండాకాలంలో చల్లచల్లగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. ఐస్ క్రీం తయారు చేసుకోవడం కాస్త క్లిష్టమైన వ్యవహారమే. అందుకు ప్రత్యామ్నాయంగా మనకు అందుబాటులో ఉండే మామిడితో కుల్ఫీ చేసి ఎంజాయ్ చేసేద్దాం...

కావలసిన పదార్థాలు:
మామిడి పండ్లు: 4
చిక్కటి పాలు: 2cups
యాలకలపొడి: 1tsp
పంచదార: 1/2cup
నిమ్మరసం: 1tsp
కుంకుమపువ్వు: కొద్దిగా
బాదం, పిస్తా, జీడిపప్పు: 1/4cup
చెర్రీ ముక్కలు: 2tbps

తయారు చేసే విధానం:

1. మామిడిపండు పై తొక్కుతీసి చిన్న ముక్కలు కోసుకోవాలి. మామిడి ముక్కలు, పంచదార, పాలు, వెడల్పాటి పాన్‌ లో వేసి కలుపుతూ దగ్గర అయ్యేంతవరకు మరిగించి దించాలి.
2. తర్వాత బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మరుగుతున్న మాంగో మిశ్రమంలో ఏలకుల పొడి, కుంకుమపువ్వు, బాదం, పిస్తా, జీడిపప్పు వేసి బాగా కలపాలి.
4. చల్లారిన తర్వాత గడ్డకట్టేంత వరకు ఫ్రిజ్‌ లో పెట్టాలి. అంతే మ్యాంగో కుల్ఫీ రెడీ. ఈ మిశ్రమాన్ని కప్పుల్లో వేసుకుని పైన చెర్రీ ముక్కలు గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Traditional classic Indian desserts..Mango Kulfi | వేసవిలో మాంగో కుల్ఫీతో మజా...


 Mango Kulfi and Pistachio Kulfi Kulfi - is an Indian version of Icecream. The mango pulp is mixed with milk, cream and cardamom, cooked till the whole mixture thickens, and then frozen into molds. The Pistacho Kulfi is basically milk and cream simmered with saffron, cardamom and pistachios till it reduces and then is frozen into molds. Traditional classic Indian desserts – a wonderful way to end the meal.
Story first published:Thursday, March 15, 2012, 18:12 [IST]
Desktop Bottom Promotion