For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాలెంటైన్స్ డే స్పేషల్ దిల్ సే (చమ్ - చమ్)

|

Cham Cham Sweet
కావలసిన పదార్ధాలు:
ఆవుపాలు: 1ltr
వెనిగర్: 10grm
పంచదార: 1/2kg (పావుకేజీ విడివిడిగా)
గేదె పాలు: 1/2 ltr
వంటసోడా : 5grm
పిస్తా: 50grm
జీడిపప్పు: 50grm
చెర్రీలు: 6

తయారు చేయు విధానము:
1. ముందుగా ఆవుపాలను బాగా వేడి చేసి పక్కనుంచుకోవాలి.
2. ఒక గిన్నెలో కొద్దిగా నీరు, వెనిగర్ వేసి బాగా కలుపుకుని దానిని వేడి పాలలో వేస్తే పాలు విరుగుతాయి.
3. అప్పుడు విరుగులోని నీళ్లను పిండేసి మిగిలిన ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఒక పాన్ తీసుకుని అందులో అరకేజీ పంచదార, టీస్పూను నీరు పోసి కరిగించాలి. అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఉండల (చంచం) ను వేసి ఉడికించి వాటిని పక్కన పెట్టాలి.
5. ఇంకొక పాన్ ను తీసుకుని అందులో గేదెపాలు పోసి మరిగిన తరవాత అందులో విడిగా ఉంచుకొన్న పావుకేజి పంచదార, వంటసోడా వేసి బాగా కలపాలి. అది మొత్తం కోవాలా తయారయిన తరువాత మంట మీద నుంచి కిందకు దింపి చల్లార్చాలి.
6. ముందుగా తయారుచేసుకున్న చమ్-చమ్‌ ల మీద ఈ మిశ్రమాన్ని వేసి, పైన పిస్తా, జీడిపప్పు, చెర్రీలతో గార్నిష్ చే సి సర్వ్ చేయాలి. అంతే చమ్ చమ్ రెడీ..

English summary

Milk | Sugar | Vinegar | Soda | Pista | Cashew Nut | Cherry | దిల్ సే (చమ్ - చమ్)

Cham Cham is a traditional Bengali sweet that is popular in India and Bangladesh. It comes in a variety of colors, mainly light pink, light yellow, and white. It is also coated with coconut flakes as a garnish.
Story first published:Saturday, February 12, 2011, 12:39 [IST]
Desktop Bottom Promotion