For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ మష్రుమ్ సూప్

|

చికెన్ మష్రుమ్ సూప్ చాలా టేస్ట్ గా ఉంటుంది. వర్షకాలంలో ఈ సూప్ ను ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. వర్షాకాలం ఇటువంటి సూప్ తీసుకోవడం, దగ్గు, జలుబు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది .

ఇందులో మష్రుమ్ జోడించడం వల్ల మరింత టేస్ట్ గా ఉంటుంది. ఇది దగ్గు మరియు జలుబు కు మంచి హోం చికిత్స వంటిది. మరి మీ టేస్ట్ బడ్స్ కు కొత్త రుచికి కలగాలంటే ఈ మష్రుమ్ చికెన్ సూప్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

chicken soup

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 250grms
చికెన్ స్టాక్: 4cup
మష్రుమ్: 10(రెండుగా కట్ చేయలి)
ఉల్లిపాయలు: 4(పచ్చకాడు సపరేట్ గా కట్ చేయాలి)
పచ్చిమిర్చి: 2(కట్ చేసినవి)
మిరియాలు: 10(పొడి చేసుకోవాలి)
కొత్తిమీర: ఒకకట్ట(సన్నగా కట్ చేసుకోవాలి)
బట్టర్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్ లో చికెన్ వేసి, అందులో నీళ్ళు పోసి 2 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ లో చికెన్ ముక్కలను వేరుగా తీసుకోవాలి. చికెన్ ఉడికించిన నీళ్ళు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి కరిగిన తర్వాత పెప్పర్ పొడి వేసి ఒక సెకన్ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిముషాలు వేగించుకవాలి.
4. తర్వాత అందులో మష్రుమ్ కూడా వేసి వేగించాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ కాడలు మరియు పక్కన పెట్టుకొన్న సన్నని చికెన్ పీసులు వేసి బాగా మిక్స్ చేసి 2నిముషాలు వేగించుకోవాలి.
5. తర్వాత అందులో నాలుగు కప్పులు, పోసి రెండు నిముషాలు ఉడికించుకోవాలి . ఇప్పుడు అందులో ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి కొత్తిమీర తరుగు కూడా వేసి 10నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే చికెన్ మష్రూమ్ సూప్ రెడీ.

Story first published: Saturday, October 4, 2014, 15:56 [IST]
Desktop Bottom Promotion