గ్రిల్డ్ ఆమ్లెట్ శాండ్‌విచ్ విత్ పుదీనా చట్నీ

Posted By:
Subscribe to Boldsky

శాండ్‌విచ్ అనేది ఒక ఆహార పదార్థం, తరచూ రెండు లేదా మరిన్ని బ్రెడ్ స్లైస్ మధ్య ఒకటి లేదా మరిన్ని పూరకాలతో ఉంటుంది, లేదా ఒక టాపింగ్ లేదా టాపింగ్స్‌తో ఒక బ్రెడ్ స్లైస్ ఉంటుంది, దీనిని సాధారణంగా ఒక ఓపెన్ శాండ్‌విచ్ అని పిలుస్తారు. శాండ్‌విచ్‌లు మధ్యాహ్న భోజనంలో బాగా ప్రజాదరణ పొందిన ఆహార రకం, సాధారణంగా ఒక ప్యాక్ చేసిన మధ్యాహ్న భోజనం వలె తినడానికి కార్యాలయం లేదా పాఠశాలకు లేదా విహారయాత్రలకు తీసుకుని వెళతారు. ఇవి సాధారణంగా సలాడ్ కాయగూరలు, మాంసం, చీజ్ మరియు పలు సాస్‌ల కలయికను కలిగి ఉంటాయి. బ్రెడ్ స్లైస్ ను అలాగే ఉపయోగించవచ్చు లేదా వాటి సువాసన మరియు ఆకృతిని పెంచడానికి ఏదైనా మసాలాలను ఉపయోగించవచ్చు. ఇవి రెస్టారెంట్లు మరియు కేఫ్‌ల్లో విరివిగా విక్రయించబడతాయి.

ఉడికించిన గుడ్డులోని టాప్ 10 గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

ఎప్పుడూ ఒకే రకమైన శాండ్‌విచ్ లను తినడం కొంచె బోర్ అనిపించవచ్చు. కాబట్టి ఈరోజు ఎగ్ తో తయారుచేసే శాండ్‌విచ్ గురించి తెలుసుకుందాం. ఆమ్లెట్ శాండ్‌విచ్ టేస్ట్ గా ఉంటుంది. టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజుకు ఒక గుడ్డు తింటే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయని నిపుణులు సూచిస్తుంటారు. అందుకే రెగ్యులర్ డైట్ లో గుడ్డును ఏదోఒక రూపంలో చేర్చుకోవడం మంచిది. ఆమ్లె శాండ్‌విచ్ ను రోజులో ఏ సమయంలో అయినా తినవచ్చు. అయితే దీన్ని కొంచెం వెరైటీగా గ్రిల్డ్ చేసి, పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉండటం మాత్రమే కాదు,శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ ను అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమ్లెట్ శాండ్‌విచ్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

Grilled Omelet Sandwich With Fresh Mint Chutney

కావల్సిన పదార్థాలు:

 • పుదీనా చట్నీ తయారుచేసుకోవడానికి కావల్సినవి
 • పుదీనా ఆకులు - 2 గుప్పెళ్లు
 • కొత్తిమీర - 1 కప్పు
 • పచ్చిమిర్చి - 2
 • వెల్లుల్లి రెబ్బలు - 2
 • అల్లం- ½ చిన్న ముక్కలు
 • నిమ్మరసం - 1 tsp
 • పంచదార- 1 tsp
 • ఉప్పు - రుచికి సరిపడా
 • ప్రతి రోజూ గుడ్డు తినడం ఆరోగ్యకరమా?వరల్డ్ ఎగ్ డే స్పెషల్
 • నీళ్ళు - ½ cup
 • గ్రిల్డ్ ఆమ్లెట్ శాండ్‌విచ్ తయారీకి కావల్సినవి
 • బ్రెడ్ స్లైస్ - 3
 • చీస్ స్లైస్ - 2
 • మింట్ చట్నీ - 1 tbsp
 • గుడ్లు - 4
 • ఉప్పు : రుచికి సరిపడా
 • బ్లాక్ పెప్పర్: రిచికి సరిపడా
 • పుదీనా చట్నీ తయారుచేయు విధానం:
 • మిక్సీ జార్ తీసుకుని, అందులో చట్నీకోసం సిద్దం చేసుకున్న పదార్థాలన్నింటిని వేయాలి. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
 • చట్నీ ఎక్కువ అయితే, ఇతర స్నాక్స్ తో పాటు తీసుకోవచ్చు.
 • ఈ చట్నీని ఫ్రిజ్ లో రెండు రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు .

గ్రిల్డ్ ఆమ్లెట్ సాడ్విచ్ ను తయారుచేయు విధానం:

1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో ఉప్పు మరియు పెప్పర్ వేయాలి. ఈ రెండింటి స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.

2. ఫ్రైయింగ్ పాన్ ను స్టౌ మీద పెట్టి ఎగ్ మిశ్రమాన్ని పోయాలి.

3. పాన్ లో ఎగ్ మిశ్రమం ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అవ్వాలి.

4. సన్నని మంటలో ఎగ్ ఆమ్లెట్ కాలుతుండగా, దాని మీద బ్రెడ్ స్లైస్ పెట్టాలి.

5. ఆమ్లెట్ కాలిన తర్వాత ఆమ్లెట్ తో బ్రెడ్ స్లైస్ ను ఫోల్డ్ చేసి అన్ని ప్రక్కలా కవర్ చేయాలి.

6. రెండు, మూడు నిముషాలు ఉడికించి తర్వాత పాన్ లో నుండి దీన్ని తొలగించాలి.

7. ఇప్పుడు బ్రెడ్ మీద చీజ్ అప్లై చేయాలి. తిరిగి సైడ్స్ లో ఆమ్లెట్ తో కవర్ చేయాలి.

పచ్చసొన తినడం లేదా ? ఐతే పోషకాలు కోల్పోయినట్టే

8. ఆ తర్వాత మరో రెండు బ్రెడ్ స్లైస్ తీసుకుని, దాని మీద పుదీనా చట్నీని అప్లై చేయాలి.

9. పుదీనా రాసిన బ్రెడ్ సాండ్విచ్ ను ఆమ్లెట్ లోపల ఉన్న బ్రెడ్ స్లైస్ మీద ఉంచాలి.

10. తిరిగి అన్ని పక్కల ఆమ్లెట్ తో కవర్ చేయాలి. ఈ మూడు బ్రెడ్ స్లైస్ విత్ ఆమ్లెట్ తో గ్రిల్డ్ చేయాలి.

11. గ్రిల్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైస్ ను ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి, వేడి వేడిగా పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.

12. గ్రిల్ చేయడానికి సాండ్విచ్ మేకర్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

13. ఇంకా కొద్దిగా వెరైటీగా..టేస్ట్ గా, హెల్తీగా ఉండటం కోసం, టమోటోలు, కీరదోసకాయ, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలను ఉపయోగించుకోవాలి.

English summary

Grilled Omelet Sandwich With Fresh Mint Chutney

This dish is accompanied with fresh mint chutney. With the proteins in the eggs and carbohydrates in the bread, you will surely feel full and prepared for the day's fast. Let's now take a look at the recipe.
Subscribe Newsletter