For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రోజూ గుడ్డు తినడం ఆరోగ్యకరమా?వరల్డ్ ఎగ్ డే స్పెషల్

|

గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్ల వాడకాన్నీ, దానిలోని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు తెలియజెప్పుతూ ప్రతియేట అక్టోబరు రెండో శుక్రవారం నాడు ‘వరల్డ్‌ ఎగ్‌ డే' నిర్వహించడం జరుగుతుంది.

మన దేశంలో గుడ్డు వాడకం అధికమనే చె ప్పాలి.‚‚‚‚ గుడ్డును పలు రూపాలలో ఆహారంగా తీసుకుంటారు. పచ్చి గుడ్డుసొనను నోటిలో పోసుకొని మింగడం, గుడ్డును ఉడికించి తిన డం, ఉడికించిన గుడ్డు బ్రెడ్‌ ని కలిపి టోస్ట్‌గా కూడా తీసుకుంటారు. అంతేకాకుండా గుడ్డు ను పలావులో, బిర్యానిలో రుచికోసం వాడతా రు, బేకరీలలో కేకుల తయారీల్లో గుడ్డును విరివిగా వాడుతారు. గుడ్డు ఆమ్లెట్‌, బుల్స్‌ ఐ,ఎగ్‌ ఫ్రై... కూరగా వాడుతారు. గుడ్డు ఏ ఒక్క వయసువారికో పరిమితమైన ఆహారం కాదు. బాల్యం నుండి వృద్దాప్యం వరకు అన్ని వయసులలో స్ర్తీ పురుషులు భేదం లేకుండా గుడ్డును తీసుకుంటారు. గుడ్డుమీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇస్తూనేవున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కిచె బుతున్నారు. ఉదయం అల్పాహారంతో గుడ్డు తీసుకోవడం మంచిదని తజా అధ్యయనము లో తేలినది. గుడ్డులో సొన శక్తినిస్తుంది. శరీ రంలో ప్రతి అవయవం మీద గుడ్డు ప్రభావం చూపుతుంది. గుడ్డును శాకాహారంగా ప్రకటించి అందరికీ గుడ్డు అందించాలనే ఉద్యమం ఇటీవలి కాలంలో ఊపందుకుంది.

గుడ్డు ద్వారా మనకందే పోషకాలు: క్యాలరీలు: 70-80, ప్రోటీన్లు : 6 గ్రాములు, క్రొవ్వులు: 5 గ్రాములు, కొలెస్టిరాల్‌: 190 గ్రాములు, నీరు: 87% , గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.

Is Eating Eggs Every Day Healthy?

కోడిగుడ్డుతో ఉపయోగాలు: మంచి చేసేవి:-
* గుడ్డు పౌష్టికాహారం. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పిల్లల పెరు గుదలకు మంచిది. కూరగా వాడుకోవచ్చు.
* కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
* గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు.
* బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు... అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు.
* గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనం వల్ల వెల్లడయ్యింది. వాస్తవంగా గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపో వటం లేదా గుడెజబ్బులు రావటం బాగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.
* మెడడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుంది.
* గుడ్డులో ఉన్న ఐరన్‌ శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. అలా గ్రహించే రూపంలో ఐరన్‌ ఉన్నందున గుడ్డు గర్భిణీ స్ర్తీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.
* గుడ్డును ఆహారంగా తీసుకోవటానికి, కొలెస్టరాల్‌కి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి రోజూ రెండు కోడి గుడ్లు తీసుకునే వారికి లైపిడ్సులో ఎటువంటి మార్పు లేకపోవడం గమనించారు. పైగా గుడ్డు వలన శరీరానికి మేలు చేసే కొలెస్టరాల్‌ పెరుగుతుందని తేలింది.
* స్ర్తీలలో రొమ్ము క్యాన్సర్‌ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకి ఉందని పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయనంలో... వారంలో 6 రోజులు గుడ్డు ఆహారంగా స్ర్తీలకు ఇచ్చారు... అప్పుడు వారిలో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే అవకాశం 44 శాతం తగ్గినట్లు తేలినది.
* గుడ్డు వలన శిరోజాల ఆరోగ్యం పెరుగుతాయి. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది.
* గుడ్డులోని ప్రోటీన్ల వల్ల యవ్వనంలో కండరాలకు బలం, చక్కని రూపం ఏర్పడుతుంది.

జాగ్రత్తలు పాటిస్తే ఆ కొద్ది నష్టాలూ ఉండవు:
* గుడ్డును బాగా ఉడికించి అందులోని బాక్టీరియాను పూర్తిగా సంహరించబడేలా చూసుకోవాలి. బాక్టీరియా వల్ల శరీరానికి నస్టం జరుగుతుంది.
* పచ్చి గుడ్దు తినడం మంచిదికాదు. తెల్లసొనలో ఎవిడిన్‌ అనే గ్లైకో పోటీన్‌ ఉన్నందున అది బి-విటమిన్‌ను శరీరానికి అందనీయకుండా చేస్తుంది.
* కొలెస్టరాల్‌ జబ్బులతో బాధపడుతున్నవారు గుడ్డును తీసుకొరాదు.
* టైప్‌ 2 డయాబిటీస్‌ ఉన్నవారు గుడ్డును వాడరాదు. రిస్క్‌ను ఎక్కువ చేస్తుందని రిపోర్టులున్నాయి.
* కొంతమందిలో ఫుడ్‌ ఎలర్జీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు ఉన్నాయి. కావున ఫుడ్‌ ఎలర్జీ ఉన్నవారు గుడ్డు తీసుకోరాదు.
* కొన్ని యాంటిబయోటిక్స్‌ మందులు ఉ దా సెఫలొస్పోరిన్స్‌ వాడేవారిలో గుడ్డు పని చేయక పోవచ్చు. ఇది యాంటిబయోటిక్‌ రెసిస్టెంట్‌.

English summary

Is Eating Eggs Every Day Healthy?

You must have heard people tell you that eating too many eggs can lead to a rise in your blood cholesterol level. The reverse point of view that you must eat one egg every day to remain healthy is also equally popular. So what is the reality when it comes to eggs? It is healthy to eat eggs every day or not? Actually, eggs are one of the most misunderstood foods in the world.
Story first published: Friday, October 10, 2014, 13:26 [IST]
Desktop Bottom Promotion