Latest Updates
-
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా! -
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే.. -
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే! -
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే! -
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి? -
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు! -
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం!
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
ఎండాకాలం రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి చల్లదనాన్నిచ్చే కూరగాయలు, పండ్లు. అందులో కీర దోసకాయ స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. ఇందులో నీటి శాతం, పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల ఎండల తీవ్రతకు డీహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. అయితే సాధారణంగా కీరా దోసకాయ అనగానే చెక్కు తీసి ముక్కలుగా కోసుకుని తినడమో లేదా సలాడ్స్ లో వాడటమో చేస్తుంటాం.
కానీ ఎప్పుడైనా కీర దోసకాయతో కమ్మని పచ్చడిని ట్రై చేశారా? వినడానికి కొత్తగా ఉన్నా దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అన్నం, ఇడ్లీ, దోశ..ఇలా దేనిలోకైనా అదిరిపోతుంది. పైగా నిమిషాల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ కీర దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
కీర దోసకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
కీరా దోసకాయలు - 4
టమాటాలు - 4
పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
పొట్టు మినప్పప్పు - 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - మీ కారానికి తగినన్ని
పసుపు - చిటికెడు
జీలకర్ర - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 10
చింతపండు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
కీర దోసకాయ పచ్చడి తయారీ విధానం
-ముందుగా తాజా కీర దోసకాయలను శుభ్రంగా కడిగి మీడియం సైజు (ఆలూ క్యూబ్స్ లాగా) ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక పల్లీలు వేసి వేయించాలి. అవి సగం వేగాక, పొట్టు మినప్పప్పు వేసి దోరగా వేయించి ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.
-స్టవ్ మీద పాన్ లో ఉన్న నూనెలో పచ్చిమిర్చి ముక్కలను బాగా వేయించి, వాటిని కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో కట్ చేసిన కీరా, టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కలపాలి. మూతపెట్టి, మీడియం మంటపై ముక్కల్లోని నీరంతా పోయి మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. అనంతరం స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-మిక్సీ జార్ లో ఉన్న పల్లీలు, పచ్చిమిర్చి మిశ్రమంలో జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు అందులో చల్లారిన కీరా-టమాటా మిశ్రమాన్ని కూడా వేసి రోటి పచ్చడిలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి, నూనె వేడి చేయాలి. అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అవి చిటపటలాడాక 3 ఎండుమిర్చి, కరివేపాకు, అర టీస్పూన్ ఇంగువ వేసి దోరగా వేయించి స్టవ్ కట్టేయాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను తాలింపులో వేసి, ఆ పోపును పచ్చడిలో బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సమ్మర్ స్పెషల్ కీరా దోసకాయ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






