వడల రుచి రెట్టింపు చేసే షేర్వా..ఇంట్లోనే ఇలా చేసుకుంటే 4 ఎక్కువే తింటారు

Posted By:

గారెలు లేదా వడలు దక్షిణ భారత ప్రజల బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరిగా ఉండే ఆహారాల్లో ఒకటి. తింటే గారెలే తినాలనే అనే సామెత కూడా మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం. వీటి రుచి అమోఘం,అద్భుతంగా ఉంటుంది. అయితే సాధారణంగా వడలు లేదా గారెల్లోకి చాలామంది సైడ్ డిష్ గా చట్నీ లేదా సాంబర్ ని తయారుచేసుకుంటారు. అయితే వీటిని షేర్వాతో తింటే కనుగ టేస్ట్ స్వర్గలోకం దాటిపోతుందంతే..నాలుగు వడలు ఎక్కువే తింటారు. వడల్లోకి సూపర్ టేస్టీగా,నోటికి కమ్మగా ఉండే షేర్వాని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

వడ షేర్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
-అల్లం
-జీడిపప్పు
-లవంగాలు
-ధనియాలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-ఆయిల్
-టమాటో
-ఉల్లిపాయ
-కారం
-గరం మసాలా
-పచ్చిమిరపకాయ
-వెల్లుల్లి
-లవంగాలు
-జాపత్రి
-సోంపు
-పచ్చి కొబ్బరి
-గసగసాలు
-ఉప్పు
-నీళ్లు

Super Tasty Vada Sherwa for Breakfast Easy Recipe in Telugu

వడ షేర్వా తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.

-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో అర టీస్పూన్ సోంపు, 5 లవంగాలు, 3 యాలకలు,కొద్దిగా జాపత్రి, 2 ఇంచుల దాల్చిన చెక్క, సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసి 1 నిమిషం వేయించుకోవాలి, మంటను మీడియంలో ఉంచాలి.

-ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇంచుల అల్లం వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి.

-తర్వాత వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు,1 టీస్పూన్ గసగసాలు, 6 జీడిపప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేశాక అందులో కొన్ని నీళ్లు పోసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ను గిన్నెలోకి తీసి పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ,2 పచ్చి మిరపకాయ ముక్కలు వేసి వేయించాలి.

-ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 టమాటో, 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటో ముక్కలు మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి.

-తర్వాత అందులో మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ను ఇందులో వేసి 3 నిమిషాలు మీడియం మంటమీద బాగా కలపుతూ ఉండాలి.

-తర్వాత అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. షేర్వా పలుచగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు పోసుకొని మూతపెట్టి మీడియం మంట మీద పావుగంటసేపు మరగనివ్వాలి.

-తర్వాత మూత తీసి అరకట్ట కొత్తిమీర తరుగు, రెండు రెమ్మల కరివేపాకు, పావు కట్ట పుదీనా తరుగు వేసి మరో నిమిషం పాటు కలుపుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ వడ షేర్వా రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion