Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
తీపి లస్సీ తయారీ విధానం ; పంజాబీ తీపి లస్సీ తయారు చేయటం ఎలా
వేసవిలో ఎంతో డిమాండ్ ఉండే ఈ తీపి లస్సీ పానీయం దానిలో ఉండే పెరుగు వల్ల చల్లచల్లగా హాయిగా ఉంటుంది.దీన్ని తయారుచేయటానికి కింద ఇచ్చిన తయారీ విధానాన్ని చిత్రాలు, వీడియో సాయంతో నేర్చుకోండి.
ఈ స్వీటు లస్సీ రెసిపి పంజాబ్ లో పుట్టింది. ఉత్తరభారతంలో ఇది ప్రసిద్ధ పానీయం. వేసవిలో ఎంతో డిమాండ్ ఉండే ఈ పానీయం దానిలో ఉండే పెరుగు వల్ల చల్లచల్లగా హాయిగా ఉంటుంది.
పంజాబీ తీపి లస్సీ పెరుగు, చక్కెర వంటి ముఖ్యపదార్థాలతో పాటు, రోజ్ వాటర్, ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్లను కూడా కలిగి ఉండే శీతల పానీయం. ఇది తేలికగా ఉండి, ప్రతి భోజనం తర్వాత తీసుకుంటారు. ప్రత్యామ్నాయంగా మీగడ లేదా క్రీమును దీనికి కలిపి కొంచెం గాఢమైన ఘనపానీయంగా కూడా మార్చవచ్చు.
ఇది చేయటం చాలా సులువు మరియు దీని తయారీ విధానం కూడా అస్సలు శ్రమ కలిగించనటువంటిది. మీ ఇంట్లో దీన్ని తయారుచేయటానికి కింద ఇచ్చిన తయారీ విధానాన్ని చిత్రాలు, వీడియో సాయంతో నేర్చుకోండి.
తీపి లస్సీ రెసిపి వీడియో
Recipe By: మీనా బంఢారీ
Recipe Type: పానీయాలు
Serves: 2కి
-
గట్టి పెరుగు - 2కప్పులు
చల్లటి పాలు - ½ కప్పు
చల్లటి నీరు - ½ కప్పు
పంచదార -3 చెంచాలు
ఏలకుల పొడి -1 చెంచా
రోజ్ వాటర్ - ½ చెంచా
ఐస్ క్యూబ్స్ - 7-8
తరిగిన బాదం - అలంకరణకి
తరిగిన పిస్తాపప్పు - అలంకరణకి
కుంకుమపువ్వు రేకులు-అలంకరణకి
-
1. గట్టి పెరుగును ఒక గిన్నెలో పోయండి
2. చల్లటి పాలు, చల్లని నీరు కూడా పోసి ఉండలు కట్టకుండా బాగా కలపండి.
3.తర్వాత చక్కెర, ఏలకుల పొడి, రోజ్ వాటర్ వేయండి.
4. ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపండి.
5. అంతటిని మిక్సీ జార్ లో పోయండి.
6. మిక్సీలో బాగా తిప్పండి.
7. వడ్డించే గ్లాసులలో పోయండి.
8. తరిగిన బాదం, పిస్తా, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.
- 1.చక్కెర నేరుగా కాకుండా పొడిచేసిన చక్కెరను కూడా కలపవచ్చు.
- 2. రోజ్ వాటర్ వేయడం వేయకపోవడం మీ ఇష్టం. తప్పనిసరి కాదు.
- సరిపోయే పరిమాణం - 1గ్లాసు
- క్యాలరీలు - 158 కాలరీలు
- కొవ్వు - 5 గ్రాములు
- ప్రొటీన్లు - 2 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 25 గ్రాములు
- చక్కెర - 10 గ్రాములు
స్టెప్ బై స్టెప్ - తీపి లస్సీ తయారీ ఎలా
1. గట్టి పెరుగును ఒక గిన్నెలో పోయండి
2. చల్లటి పాలు, చల్లని నీరు కూడా పోసి ఉండలు కట్టకుండా బాగా కలపండి.
3. తర్వాత చక్కెర, ఏలకుల పొడి, రోజ్ వాటర్ వేయండి.
4. ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపండి.
5. అంతటిని మిక్సీ జార్ లో పోయండి.
6. మిక్సీలో బాగా తిప్పండి.
7. వడ్డించే గ్లాసులలో పోయండి.
8. తరిగిన బాదం, పిస్తా, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




























