For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాక్లెట్ చిప్ కేక్ రిసిపి: దివాళి స్పెషల్

By Super Admin
|

ఈ దీపావళికి చాక్లెట్ చిప్స్ కేక్ చేసి మీ కుటుంబ సభ్యులనీ, స్నేహితులనీ ఆశ్చర్యపరచండి.కానీ కేక్ అంటే చాలా సమయం పడుతుందనీ చాలా వస్తువులు కావాలనీ అనుకుంటున్నారు కదా?? కానీ దీని తయారీ చాలా సులువు. కేక్స్ అంటే క్రిస్టమస్ స్పెషల్స్ కదా అనిపించవచ్చు, కానీ చాక్లెట్ చిప్స్ కేక్ ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు.

ఇక దీపావళీ అంటే ఆరోజున బెస్ట్ స్వీట్ వంటకం ఉండాలనుకుంటారు కదా?? మరింక ఆలశ్యమెందుకు?? ఈ కేక్ తయారు చేసి మీ దీపావళికి మరింత శోభని చేకూర్చండి.

ఇక దీని తయారీకి కావాల్సిన వస్తువులు, తయారు చేసే విధానం చూద్దామా??

ఎన్ని కేక్స్ వస్తాయి-4 కప్ కేక్స్

సామానులు సమకూర్చుకోవడానికి-20 నిమిషాలు

తయారీ సమయం-50 నిమిషాలు

కావాల్సిన సామాగ్రి:

1.వైట్ చాక్లెట్-170 గ్రాములు(సన్నగా తరగాలి)

2.డార్క్ చాక్లెట్ చిప్స్-50 గ్రాములు

3,వెన్న-25 గ్రాములు

4.పంచదార-70 గ్రాములు

5.గ్రుడ్లు-2

6.వనిల్లా ఎసెన్స్-ఒక టీ స్పూను

7.రిఫైండ్ ఫ్లోర్ లేదా మైదా-40 గ్రాములు.

8.ఉప్పు-చిటికెడు

9.కోకో పౌడర్-పాన్ మీద డస్టింగ్ కోసం

Chocolate Chips Cake For Diwali

1.ముందుగా ఒక గిన్నెలో వెన్న తీసుకుని దానిలో పంచదార వేసి హ్యాండ్ బ్లెండర్‌తో బాగా గిలక్కొట్టాలి.

2.మైక్రోవేవ్‌లో వైట్ చాక్లెట్ని అక్రిగించుకోవాలి.

3.చాక్లెట్ కరిగేలోపు ఒక గ్రుడ్డుని వెన్న, పంచదార మిశ్రమంలో వేసి మరల గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.

Chocolate Chips Cake For Diwali

4.కరిగిన చాక్లెట్ ఓవెన్ నుండి బయటకి తీసి కలిపి పక్కనుంచాలి.

6.ఇప్పుడు వెన్న, పంచదార మిశ్రమానికి రెండో గ్రుడ్డు కూడా కలిపి అన్నింటినీ బాగా కలపాలి.అన్నీ కలిసిపోయాకా మెల్లిగా ఒకసారి కలిపి కరిగిన చాక్లెట్ దానిలో వెయ్యాలి.

Chocolate Chips Cake For Diwali

7.ఇప్పుడు మళ్ళీ కలిపి వనిల్లా ఎసెన్స్ వెయ్యాలి.

8.ఒక చిన్న గిన్నెలో మైదా వేసి దానిలో డార్క్ చాక్లెట్ చిప్స్ వెయ్యాలి.దీనిలో చిటికెడు ఉప్పు వేసి గ్రుడ్డు మిశ్రమంలో కలపండి.

9.కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మిశ్రమాన్ని మళ్ళీ కలపాలి.

Chocolate Chips Cake For Diwali

10.మీ కేక్ మిశ్రమం తయారు. ఇప్పుడు కప్ కేక్స్ మౌల్డ్స్ తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని సమానంగా వెయ్యండి.ఇది కేక్ మౌల్డ్స్‌లో వేసే ముందు క్రింద ఇచ్చిన సూచనలు పాటీంచండి.

11.మిశ్రమాన్ని వేసే ముందు ప్రతీ కప్పుకీ వెన్న రాయండి.

12.వెన్న రాసాకా కోకో పౌడర్ పైన చల్లాలి.ప్రతీ మౌల్డ్‌నీ ఇలా చేసుకోవాలి.

Chocolate Chips Cake For Diwali

13.కేక్ మిశ్రమాన్ని ముప్పావు వంతు కేక్ మౌల్డ్‌లో నింపాలి.

14.ముందుగా 200 డిగ్రీ సెల్సియస్ వరకూ వేడి చేసి పెట్టుకున్న ఓవెన్‌లో కప్ కేక్ మౌల్డ్స్ ఉంచి 14 నిమిషాల పాటు బేక్ చెయ్యాలి.

Chocolate Chips Cake For Diwali

15.కేక్ తయారయ్యాకా కేక్ మౌల్డ్ నుండి కేక్ ని బయటకి తీసే ముందు ఒక 2-3 నిమిషాలు అలా ఉండనివ్వండి.

16.ఇప్పుడూ మెల్లిగా కేక్ మౌల్డ్ నుండి కేక్ బయటకి తియ్యండి.

గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ కేక్‌ని కనుక మీ అతిధులకి సర్వ్ చేస్తే పసైందైన ఈ కేక్ రుచి,లోపల లావాలా ఉన్న చాక్లెట్ రుచి వారిని సమ్మోహితులని చేస్తుంది.

వినడానికే ఎంత బాగుందో కదా. ఇక ఆలశ్యమెందుకు ప్రయత్నించండి మరి.

English summary

Chocolate Chips Cake For Diwali

Why not make chocolate chips cake this Diwali and surprise everyone and make them happy to the fullest?You may think making this will be time consuming and you will need many ingredients. But, this recipe is not difficult at all. Cakes are exclusive for Christmas. But, when it is a chocolate chips cake, you don’t have to see the occasion.
Desktop Bottom Promotion