For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకోనట్ కుకీస్ : క్రంచీ స్నాక్ రిసిపి

|

కరకరలాడే కుకీస్ అంటే పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా ఇష్టమైన స్నాక్ రిసిపి. కుకీస్ లో వివిధ రకాలు కుకీస్ ఉన్నాయి. వాటిలో కోకనట్ కుకీస్ ఒకటి .

ఈ కోకనట్ కుకీస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆకలిగా ఉన్నప్పుడు కోకనట్ కుక్కీస్ తీసుకొని తినడం వల్ల వెంటనే ఆకలిని తగ్గించుకోవచ్చు .ఇది మీ శరీరానికి క్యాలరీలను చేర్చే జంక్ ఫుడ్ కాదు . మరియు ఇందులో ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు. మరి ఈ క్రించీ కుకీస్ ను తినడానికి ఇంత కంటే మంచి అవకాశం మరేం కావాలి. ఇంకెందుకు ఆలస్యం, కోకనట్ క్రంచీ కుకీస్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

Crunchy Coconut Cookie Recipe

బట్టర్ - 1 cup (unsalted)
బ్రౌన్ షుగర్ - 1 cup
కోకనట్ ఎసెన్స్ - 1/4th teaspoon
వెనీలా ఎసెన్స్ - 1/4th teaspoon
కొబ్బరినూనె - 1 cup
గుడ్డు- 1
పాలు - 1/2 cup
మైదా - 1/2 cup
బేకింగ్ పౌడర్ - 1/2 teaspoon

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని, స్టౌ మీద పెట్టి. తర్వాత అందులో బట్టర్ వేసి కరగించాలి.

2. బట్టర్ కరిగిన తర్వాత అందులో బ్రౌన్ షుగర్, మరియు గుడ్డు లోపలి సొన వేసి బాగా మిక్స్ చేయాలి.

3. తర్వాత అందులోనే కొబ్బరి తురుము, కోకోనట్ ఎసెన్స్ మరియు వెనీలా ఎసెన్స్ వేయాలి.

4. అందులోనే కొద్దిగా పాలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మైదా వేసి , చిక్కగా అయ్యే వరకూ మిక్స్ చేయాలి . చివరగా బేకింగ్ పౌడర్ ను వేసి మిక్స్ చేయాలి

5. ఈ పిండి నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసి చేతి పెట్టి ఫ్లాట్ చేయాలి. ఇలా మొత్తం తయారుచేసుకొన్నాక వీటికి కుక్కింగ్ పాన్ లో వేట్టాలి.

6. ఈ కుక్కింగ్ పాన్ ను 160డిగ్రీ సెంటీగ్రేడ్ లో పెట్టి 15నిముషాలు బేక్ చేయాలి.

English summary

Crunchy Coconut Cookie Recipe

Cookies are a favourite snack to many. It is the best snack that you can have and truly relish its every bite. There are many varieties of cookies that you may know to prepare; however, the crunchy coconut cookie is something that you must try today.
Story first published: Thursday, February 4, 2016, 17:49 [IST]
Desktop Bottom Promotion