For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తింటుంటే తినాలనిపించే పెసరపప్పు పాయసం ఈసీ రెసిపీ

By Swathi
|

శరీరానికి చలువదనాన్ని ఇచ్చే పెసరపప్పు తరచుగా తీసుకోవడం చాలా అవసరం. పాయసంగా.. పొంగలిగా.. మొలకెత్తిన గింజలు.. సున్నండలు.. పెసరట్టు.. ఎలా తీసుకున్నా.. పెసల రుచి అమోఘంగా ఉంటుంది. కమ్మని రుచి.. సువాసనతో తింటుంటే తినాలిపిస్తాయి పెసల వంటకాలు. రకరకాల వంటకాల్లో, చర్మ సౌందర్య సాధనాల్లో ఉపయోగించే పెసలతో ఇవాళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి కాపాడటానికి పెసలు సహకరిస్తాయి. కాబట్టి తరచుగా పాయసం రూపంలో తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. పాయసంలో వాడే పెసలు చలువదనాన్ని ఇస్తే.. ఇందులో ఉపయోగించే బెల్లం శరీరానికి ఐరన్ ని అందిస్తుంది. కాబట్టి.. ఈజీగా.. త్వరగా తయారయ్యే పెసరపప్పు పాయసం చేసుకుని చిన్నా పెద్దా అందరూ కలిసి లాగించేయండి.

payasam

కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
బెల్లం - ఒక కప్పు
పాలు - అరలీటరు
కొబ్బరి - అరకప్పు
ఏలకులు -4
కిస్ మిస్ -10
జీడిపప్పు - 10
నెయ్యి -4 స్పూన్లు

తయారు చేసే విధానం
ముందుగా పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ లు వేయించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు పెసపప్పును పాలల్లో ఉడకబెట్టాలి. అవి కాస్త మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం తురుము కలపాలి. బెల్లం కరిగి.. పాయసం చిక్కబడే ముందు కొబ్బరి తురుము కలిపి కాసేపు మరగనివ్వాలి. తర్వాత ఏలకుల పొడి కలపాలి. స్టవ్ కట్టేసి ముందు వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ కలిపి.. వేడి వేడిగా తింటే కమ్మగా ఉంటుంది.

English summary

moong dal payasam (kheer)| pesara pappu payasam recipe

South Indian style pesarapappu payasam recipe with step by step photos. A smooth creamy and delicious tasting kheer.
Story first published: Saturday, January 9, 2016, 17:33 [IST]
Desktop Bottom Promotion