For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గా పూజ స్పెషల్:పైనాపిల్ షీరా తయారీ విధానం

By Super Admin
|

నవరాత్రులు మొదలయ్యాయి. బెంగాలీలు మహా సప్తమి రోజున బోధన్‌తో మొదలయ్యే దుర్గా పూజ కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.

దుర్గా పూజని భారత దేశమంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా బెంగాలీలు అందరూ కలిసి భక్తి భావంతో దుర్గా మాతని పూజిస్తారు.ఈ పూజ కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఒక ఫుడ్ ఫెస్టివల్,ఫ్యాషన్, డెకరేషన్ ఇత్యాదివికూడా ఈ పండగలో భాగమే.ఇక ఆహారం విషయానికొస్తే పండగ సమయాలు మించి ఎప్పుడు ప్రయత్నిస్తాము రక రకాల వంటలని??

విజయదశమి రోజున అతిధులని రకరకాల స్వీట్లతో ఆహ్వానిస్తాము కదా.ఈ సారి పైనాపిల్ షీరా ఎందుకు ప్రయత్నిచకూడదూ??మీకు షీరా చెయ్యడమెలాగో తెలిస్తే దానికి పైనాపిల్ తోడయితే, షీరాకి అబ్బే సువాసనే వేరు.

ఇలాగే చాక్లెట్ లేదా బనానా షీరా కూడా చెయ్యచ్చు.ఈరోజు పైనాపిల్ షీరా ఎలాచెయ్యాలో వివరంగా ఇచ్చాము.ఈ సారి ఇది ప్రయత్నించి పండగ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి.

ఎంతమందికి సరిపోతుంది-4

తయారీ సమయం-5 నిమిషాలు

వండటానికి-20 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

1.పైనాపిల్ ప్యూరీ/అనాస పండు గుజ్జు-ఒక కప్పు

2.నెయ్యి-ఒక టేబుల్ స్పూను

3.పంచదార-ఒక టేబుల్ స్పూను

4.లో ఫ్యాట్ మిల్క్-ఒక కప్పు

5.సేమోలీనా-ఒక కప్పు

6.పంచదార కి బదులుగా వాడేది ఏదైనా-మూడు తేబుల్ స్పూన్లు

7.ఏలకౌల [ఒడి-అర టీ స్పూను

8.కుంకుమ పువ్వు-కొన్ని రేకులు(పాలల్లో నానబెట్టినవి)

తయారీ విధానం:

1.ఒక మందపాటి గిన్నెలో పైనాపిల్ ప్యూరీ ,పంచదారా వెయ్యాలి.

2.ఈ రెండింటినీ బాగా కలిపి 3-4 నిమిషాలు ఉడికించాలి.

Pineapple Sheera Recipe For Durga Puja

3.వేరొక మూకుడులో నెయ్యి వేసి సెమోలీనా వేసి దోరగా వేయించాలి. సన్నని మంట మీద సేమోలీనా గులాబీ రంగులోకి వచ్చేవరకూ వేయించుకోవాలి. దీనికి కాస్త సమయం పడుతుంది.కాస్త ఓపికతో వేయించాలి.

4.వేయించిన సేమోలీనాకి పాలు, నీళ్ళూ వేసి వెంటనే ఉణ్డలు కట్టకుండా కలపాలి.

Pineapple Sheera Recipe For Durga Puja

5.ఈ మిశ్రమం కాస్త దగ్గరకి రాగానే పంచదారకి బదులు వాడే పదార్ధాన్ని వేసి ఈ మిశ్రమం పొడిగా అయ్యేవరకూ కలపాలి.

6.ఇప్పూడు దీనిలో ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న పైనాపిల్ ప్యూరీ మీశ్రమాన్ని వేసి సన్నని మంట మీద మెల్లిగా కలపాలి.

Pineapple Sheera Recipe For Durga Puja

7.దీనికి పాలల్లో నానబెట్టిన కుంకుమ రేకులు, ఏలకుల పొడి వేసి 1-2 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి.

8.మీ పైనాపిల్ షీరా తయారయినట్లే.ఒక గ్లాసు బౌల్లో దీనిని వేసి మూత పెట్టి, బౌల్ని తిప్పి ఒక ప్లేటులో మెల్లిగా బోర్లించాలి.

Pineapple Sheera Recipe For Durga Puja

9.ఇప్పుడు నెమ్మదిగా పైనున్న బౌల్‌ని తీస్తే షీరా బౌల్ ఆకారంలో ప్లేటులో ఉంటుంది.

10.దీనిమీద బాదాం, వాల్నట్స్,జీడిపప్పులతో అలంకరించి వడ్డించడమే.

Pineapple Sheera Recipe For Durga Puja

English summary

Pineapple Sheera Recipe For Durga Puja

Navratri has already started and the Bengalis are easgerly waiting for the Durga Puja, which is going to commence from the 'Mahasaptami' with 'Bodhon'.
Desktop Bottom Promotion