స్వీట్ పొంగల్ పోహా రిసిపి: సంక్రాంతి స్పెషల్

Posted By:
Subscribe to Boldsky

భారతదేశంలో పొంగల్ ఫెస్టివల్ చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఈ పండుగను మూడు లేదా నాలుగు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమిళీయులకు కూడా అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగ రోజున ప్రత్యేకంగా స్వీట్ పొంగల్ ను వండి ఇంట్లోని వారికి, బంధువులకు వడ్డిస్తారు. పొంగల్ అనేది సౌత్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకొనే ఒక పెద్ద పండుగ. నార్త్ ఇండియాలో ఈ పండుగను మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ పర్వదినానా ఒక వెరైటీ స్పెషల్ ఫుడ్ ను తయారుచేసుకుంటారు మరియు పొంగల్ చాలా సాధారణ రిసిపి.

ఆంధ్రులకు అతి పెద్ద పండుగ 'సంక్రాంతి’

పొంగల్ రిసిపిని స్వీట్ గా లేదా సావరీగా తయారుచేసుకోవచ్చు. కారం పొంగలి సెమీ లిక్విడ్ పొంగల్. దీన్ని బియ్యం పెసరపప్పుతో వండుతారు. పొంగల్ అంటే స్వీట్ పొంగల్ మరియు కారం పొంగల్ రెండు వండుతారు. కారం పొంగలి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ రిపిలలో చాలా ఫేమస్. తయారు చేయడం కూడా సులభం మరియు చాలా సింపుల్ రిసిపి. కారం పొంగల్ లాగే స్వీట్ పొంగల్ కూడా చాలా సింపుల్ గా, త్వరగా తయారుచేయవచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఇంట్లోనూ ఈ స్వీట్ పొంగల్ పొంగాల్సింది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Sweet Pongal Poha Recipe for Sankranti

బియ్యం నూక - 2 cups

పెసరపప్పు - 1 cup

కొబ్బరి తురుము - 1 cup (grated)

బెల్లం - 1 cup (grated)

యాలకలు - 2 to 3

నెయ్యి - 1 cup

రేగిపండ్లలోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ద్రాక్ష - 1/2 cup

జీడిపప్పు - 1/2 cup

చక్కెర పొంగల్ : పొంగల్ స్పెషల్ రిసిపి

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో పెసరపప్పు వేసి 5నిముషాలు ఫ్రైచేసుకోవాలి.

2. తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకొని వేయించుకొన్న పెసరపప్పును అందులో వేసి సరిపడా నీళ్ళు పోయాలి.

3. కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

4. అంతలోపు, బీటన్ రైస్(బియ్యం నూక) తీసుకొని శుభ్రంగా కడిగి 15 పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. అందులోనే బెల్లం కూడా వేసి బెల్లం కరిగే వరకూ ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.

సంక్రాంతి మొదటి రోజు 'భోగి’ భాగ్యాల విశిష్టత

6. ఇప్పు చిన్న పాన్ మరో స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి అందులో ద్రాక్ష మరియు జీడిపప్పు వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.

7. 15నిముషాల తర్వాత బెల్లం ఉడుకుతున్న పాన్ లో నానబెట్టుకొన్న బియ్యంను మరియు ముందుగా ఉడికించిన పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

8. మెత్తం మిశ్రమం మెత్తగా ఉడికే సమయంలో నెయ్యిలో వేయించి పెట్టుకొన్న ద్రాక్ష యాలకలు మరియు జీడిపప్పు అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి.

9. అంతే వేడి వేడిగా రుచికరమైన స్వీట్ పొంగల్ రిసిపి రెడీ.

English summary

Sweet Pongal Poha Recipe for Sankranti

Sweet Pongal Poha Recipe for Sankranti,Sankranti or Pongal is a harvest festival that is celebrated throughout India. This is the first festival that is celebrated at the beginning of the year. It is called a harvest festival, as it is that time of the year when people and farmers celebrate and thank the god and those who have helped them for their yeild.