Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
టమాటో ఎండు చేపల కూర.. వేడి వేడి అన్నంతో రుచి అద్భుతం!
మన తెలుగు రాష్ట్రాల్లో ఎండు చేపల గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. మన నానమ్మ, అమ్మమ్మల కలం నుంచి ఈ ఎండు చేపలతో కూరలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ రుచి అమోఘంగా ఉంటుంది. అది కూడా టమాటోలతో ఎండు చేపల కూర చేసుకునే తింటే రుచి వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంతో సులభంగా క్షణాల్లోనే చేసుకునే ఈ కూరను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా.. భోజనం అదిరిపోతుంది. అయితే ఈ టమాటో ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టమాటో ఎండు చేపల కూరకు కావాల్సిన పదార్థాలు
ఎండు చేపలు
టమాటోలు
ఉల్లిపాయలు
పచ్చి మిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం
పసుపు
రుచికి సరిపడా ఉప్పు
కరివేపాకు
కొత్తిమీర
చింతపండు
ఆయిల్
టమాటో ఎండు చేపల కూర వండుకునే విధానం
ముందుగా ఎండు చేపలను శుభ్రంగా కడుక్కొని వేడి నీటిలో ఓ పది నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, దానిపై ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నూనె వేసుకోవాలి. అందులో ఎండు చేపలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసుకొని వాటి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత టమాటో ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
టమాటోలు మెత్తగా ఉడికాక అందులో కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఎండు చేపల ముక్కలు కూడా వేసుకొని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తరువాత అందులో కొంచెం నీళ్లు పోసుకొని మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. కూర ఎండ్‌కి వచ్చే సమయంలో మసాలాలు, కొత్తిమీర చల్లుకొని ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని కూరను దించుకుంటే ఎంతో రుచికరమైన టమాటో ఎండు చేపల కూర సిద్ధమైట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












