Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
చూడగానే నోట్లో రసాలూరించే కొబ్బరి లౌజు..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే
భారతీయ పండుగలు, శుభకార్యాలు అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేవి సాంప్రదాయ పిండి వంటలు. వీటిలో కొబ్బరి లౌజు (కొబ్బరి బర్ఫీ) కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి, చక్కెరతో తయారుచేసే ఈ తీపి వంటకం కేవలం రుచిలో మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని సాధారణంగా కొబ్బరి లౌజు అని పిలుస్తారు. ఇది తయారు చేయడం చాలా సులభం, ఎక్కువ సమయం పట్టదు. ఇంట్లో లభించే సాధారణ పదార్థాలతోనే దీన్ని చేసుకోవచ్చు. కొబ్బరి లౌజు తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
కొబ్బరి లౌజు తయారీకి కావాల్సిన పదార్థాలు
-కొబ్బరి
-చక్కెర
-యాలకలు
-నెయ్యి
-నీళ్లు
కొబ్బరి లౌజు తయారీ విధానం
-ముందుగా ఒక ముదురు పచ్చి కొబ్బరికాయను ముక్కలుగా చేసుకోవాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో కొబ్బరి ముక్కలన్నీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు 10 యాలకలను దంచి పక్కన పెట్టుకోండి.
-తర్వాత ఓ ట్రే తీసుకొని దాని అంచులకు,సైడ్స్ కి నెయ్యి రాసుకోండి.
-ఇప్పుడు మిక్సీలో వేసి చేసుకున్న కొబ్బరి తురుము కొలుచుకోండి. ఎందుకంటే దీనికి సమానంగా చక్కెర వేసుకోవాలి. ఒక ముదురు కొబ్బరికాయ అయితే సాధారణంగా రెండున్నర కప్పుల తరుము వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టి అందులో 2 కప్పుల చక్కెర వేసి, అరకప్పు నీళ్లు పోసి కలుపుతూ ఓ లేత తీగ పాకం రానివ్వాలి.
-ఇప్పుడు కొబ్బరి తురుమును అందులో వేసి తక్కువ మంట మీద కలుపుతూ తెల్లని నురగ పాకం వచ్చేదాకా మరగనివ్వాలి.
-ఇప్పుడు అందులో యాలకల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలిపేశాక స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని నెయ్యి రాసి ఉంచిన ట్రేలో పోసేయండి. తర్వాత వెంటనే చాకుతో కొబ్బరి మిశ్రమానికి గాట్లు పెట్టుకొన్నాక కనీసం 2 గంటల పాటు చల్లారనివ్వాలి.
-తర్వాత దాన్ని ముక్కలుగా బయటకు తీసుకోండి. అంతే రసాలూరించే కొబ్బరి లౌజు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











