Latest Updates
-
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా! -
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే.. -
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే! -
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే! -
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి? -
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు! -
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ!
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే!
తెలుగు లోగిళ్లలో పండుగ సందడి మొదలుకాబోతోంది. మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీక అయిన ఉగాది పర్వదినం ఈ ఏడాది మార్చి 19న రానుంది. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. అయితే పచ్చడితో పాటు ఈ పండుగ రోజున ప్రతి ఇంటా ఘుమఘుమలాడే మరో అద్భుతమైన తీపి వంటకం బొబ్బట్లు.
ప్రాంతాలను బట్టి వీటిని భక్ష్యాలు, ఒబ్బట్టు, పూరన్ పోలీ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. నెయ్యి వేసుకుని వేడివేడి బొబ్బట్లు తింటుంటే ఆ మజాయే వేరు, తినేకొద్దీ తినాలనిపిస్తుంది.
బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు
కావాల్సిన పదార్థాలు
పచ్చి శనగపప్పు - 1 కప్పు
మైదా పిండి - 2 కప్పులు
బెల్లం తురుము - 1 కప్పు
యాలకుల పొడి - అర టీ స్పూన్
ఉప్పు - పావు టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
నూనె - 4 టేబుల్ స్పూన్లు
నెయ్యి - తగినంత
బొబ్బట్లు తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, చిటికెడు ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి కలపాలి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా మృదువుగా కలుపుకోవాలి. ఆపై 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మర్దన చేయాలి. చివరగా నూనె పోసి బాగా కలిపి, మూతపెట్టి కనీసం 2 గంటల పాటు పిండిని నాననివ్వాలి.
-పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి గంటపాటు నీటిలో నానబెట్టాలి.
-కుక్కర్ లో నానిన పప్పు, రెండు కప్పుల నీళ్లు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ నూనె వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఆవిరి పోయాక నీటిని వడకట్టి, పప్పు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి, బెల్లం తురుము వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో రుబ్బి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మధ్యమధ్యలో నెయ్యి వేస్తూ మీడియం మంట మీద ఉడికించాలి.
-మిశ్రమం దగ్గరపడి, నెయ్యి పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక చేతికి నెయ్యి రాసుకుంటూ ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా (పూర్ణం) చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మైదా పిండిని తీసుకుని మీడియం సైజు ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండను చేతితో కాస్త వెడల్పుగా చేసి, అందులో పూర్ణం ముద్దను పెట్టి అంచులు పూర్తిగా మూసేయాలి.
-ఇప్పుడు చపాతీ పీట మీద ఒక బటర్ పేపర్ ఉంచి, దానిపై ఈ ముద్దను పెట్టి సున్నితంగా ప్రెస్ చేయాలి. పైన మరో బటర్ పేపర్ ఉంచి చపాతీ కర్రతో పల్చగా బొబ్బట్లుగా వత్తుకోవాలి.
-స్టవ్ మీద పెనం వేడి చేసి తయారుచేసుకున్న బొబ్బట్టును వేసి రెండు వైపులా నెయ్యి రాసుకుంటూ దోరగా, ఎర్రగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే బొబ్బట్టు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











