For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

మనందరికీ తెలుసు ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఆ రోజుకు ఎంత ముఖ్యమో. కాబట్టి, వీక్ డేస్ లో ఆఫీస్ లేదా కాలేజ్ స్కూల్ వెళ్ళే వారు హాడావిడీగా ఏదో ఒకటి తినేసి వెళ్ళడం లేదా అసలు తినకుండా వెళ్ళడం చేస్తుంటారు. అటువంటి వంటి వారికోసం ఒక సింపుల్ హెల్తీ అండ్ న్యూట్రీషియన్ రిసిపిని అందిస్తున్నాం.

ఈ సీజన్ లో మార్కెట్లో బనానా మరియు బెర్రీస్ విరివిగా కనబడుతున్నాయి. వీటిని తీసుకొచ్చి చాలా సింపుల్ గా, సులభంగా అరటి బ్రెర్రీ సలాడ్ తయారుచేసుకొని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే, మన శరీరానికి కావల్సినన్ని న్యూట్రీషియన్స్ అందుతాయి. ఈ బనానా బెర్రీ సలాడ్ ను 5నిముషాల్లో తయారుచేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Banana Berry Salad For Breakfast

కావల్సిన పదార్థాలు
అరటిపండ్లు: 3(సన్నగా మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
రాస్బెర్రీస్ : 10
స్ట్రాబెర్రీస్: 5(రెండుగా కట్ చేసుకోవాలి)
చల్లిటి పెరుగు: 1cup
మిల్క్ క్రీమ్ : 2tbsp
తేనె: 1tbsp
మాప్లే సిరప్: 1tbsp

తయారు చేయు విధానం:
1. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న అరటిపండు ముక్కలు మరియు బెర్రీస్ మరియు పెరుగు వేయాలి.
2. పెరుగు చిక్కగా మరియు చల్లగా ఉన్నది తీసుకుంటే, పండ్లు పుల్లగా కాకుండా ఉంటాయి.
3. తర్వత మిల్క్ క్రీమ్ సలాడ్స్ మీదకు మిల్క్ క్రీమ్ ను పోయాలి, అలాగే తేనె మరియు మాప్లే సిరఫ్ ను కూడా జోడించాలి.
4. మీరు కనుక లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నట్లైతే క్రీమ్ ను తక్కువగా వేసుకోవచ్చు. లేదా లో ఫ్యాట్ క్రీమ్ ను వినియోగించుకోవచ్చు. అంతే బనానా బెర్రీ సలాడ్ రిసిపి రెడీ.

English summary

Banana Berry Salad For Breakfast


 We all know that it is healthy to have breakfast in the morning. However, in the crunching rush of the morning on a weekday, how is one supposed to make time for breakfast. The biggest problem is that not only do you have to make time to eat breakfast but also to make it.
Story first published: Tuesday, October 28, 2014, 11:57 [IST]
Desktop Bottom Promotion