For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిసిబిళె బాత్

|

Bisi Bele Bath
కావలసిన పదార్థాలు:

బియ్యం : 1/2 kg
క్యారెట్ : 2
కందిపప్పు : 1/2
బీన్స్ : 1 cup
బఠానీ : 1 cup
కరివేపాకు : 2 రెబ్బలు
మసాలకి కావలసిన పదార్థాలు:

దనియాలు - 2 tsp
మినపప్పు : 1 tsp
ఎండుమిరపకాయలు : 4
జిలకర్ర : 1 tsp
మెంతులు : 1tsp
దాల్చిన చెక్క : 2
లవంగాలు : 5
నూనె - తగినంత
ఉప్పు : రుచికి సరిపడా
చింతపండు : గోలి అంత
పోపు దినుసులు : కొంచెం

తయారు చేయు విధానం: ముందుగా పోపు దినుసులు నూనెలో కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత బియ్యం, పప్పుని తగినంత నీరు పోసి కుక్కర్ లో ఉడికించి పెట్టుకోవాలి. చింతపండుని నానపెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. అన్ని కూరగాయలను తగినంత నీరు పోసి విడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నెల్లో ఉడికించిన ముక్కలు వేసుకుని అవి మళ్ళీ కొద్దిగా వేడయ్యాక అందులో మసాల పొడిని వేసి బాగా కలుపుకుని, అందులో చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, నీరు తగినంత వేసి ఉడికించాలి. మసాలా, చింతపండు గుజ్జు లో బాగా కలిపి నీరు కూడా పోసి సిమ్ లో పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేడి చేసి ఆవాలు, జిలకర్ర, ఇంగువ పోపు పెట్టి ఆ మిశ్రమంలో వేసి కలియబెట్టాలి. మరొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పులు వేయించి కరివేపాకు వేసి వేగాక బిసిబెళె బాత్ ని గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.

Story first published:Thursday, October 15, 2009, 18:17 [IST]
Desktop Bottom Promotion