For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండ్లీ - దోసె రెండింటికీ ఒకే కాంబినేషన్ చట్నీ

|

Chutney for Idly/Dosa
కావల్సిన పదార్థాలు:
పల్లీలు(వేయించిన వేరుశెనగపప్పు): 1/4cup
పుట్నాలపప్పు(వేయించిన వి): 2tbsp
ఎండు కొబ్బరి తురుము: 1tbsp
పచ్చిమిర్చి: 5-6
ఉప్పు: రుచికి తగినంత
నీళ్ళు : సరిపడా
పోపు కోసం:
ఆవాలు: 1/4tsp
శెనగపప్పు: 1/2tsp
ఎండు మిర్చి: 2
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఎండు మిర్చి, శెనగపప్పు, కరివేపాకు ఒక దాని తర్వాత ఒక టి వేసి పోపు దోరగా వేయించుకొని స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చట్నీకోసం వేయించి పెట్టుకొన్న పల్లీలు, పుట్నాలపప్పు, ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3. ఇప్పడు ముందగా వేయించి పెట్టుకొన్న పోపును చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఇడ్లీ, దోసె చట్నీ రెడీ.. వేడి వేడి దోసె లేదా ఇడ్లీతో చట్నీ సర్వ్ చేయండి.

English summary

Chutney for Idly/Dosa | ఇండ్లీ -దోసె రెండింటికీ ఒకే చట్నీ

This South Indian tomato chutney is great with idli, dosa, vada, as well as with french fries and chips. This site is dedicated to all Idly and Dosa Lovers.
Story first published:Wednesday, August 1, 2012, 10:08 [IST]
Desktop Bottom Promotion