For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్పీ ఆలూ అండ్ పనీర్ ఫ్రైడ్ స్టిక్స్

|

ఆలూ పనీర్ ఫ్రైడ్ స్టిక్ ఇది చాలా బేసిక్ రిసిపి. అంతే కాదు, ఫుల్ న్యూట్రీషియన్స్, కార్బోహైడ్రేట్స్ ను అందించే స్నాక్ డిస్ . ఈ స్పెషల్ కాంబినేషన్ ఆలూ మరియు పనీర్ ఫ్రైడ్ స్టిక్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాము.

ఈ రిసిపి చాలా టేస్టీ అండ్ కరకరలాగే డిష్ . మీరు ఇంతవరకూ టేస్ట్ చేసుండరు . ఈ స్పైసీ డిష్ ను ఆప్టిటైజర్ గా అందివ్వొచ్చు . లేదా ఈవెనింగ్ స్నాక్ గా కూడా తీసుకోవచ్చు.

ఆలూ మరియు పనీర్ ఫ్రైడ్ స్టిక్ తయారుచేయడం చాలా సులభం . ఈ వంటను తయారుచేయడానికి కావల్సిన పదార్థాలను ఈ క్రింది విధంగా అందివ్వడం జరిగింది మరి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Crispy Aloo And Paneer Fried Sticks


కావల్సిన పదార్థాలు:
బంగాళదుంప - 3
పన్నీర్ - 200 g
ఉల్లిపయాలు - 1/2 cup
పచ్చిమిర్చి పేస్ట్ - 1/4th teaspoon
రెడ్ చిల్లీ పౌడర్ - 1/2 teaspoon
కార్న్ ఫ్లోర్ - 1 cup
మైదా - 1/4th teaspoon
మైదా - 1/2 cup
నూనె:సరిపడా
ఉప్పు రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. బంగాళదుంపను మరియు పనీర్ ను స్లైస్ గా కట్ చేసుకోవాలి.
2. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మార్చుకొని అందులో పచ్చిమిర్చి పేస్ట్, కారం, మైదా, గరం మసాలా మరియు ఉప్పు వేయాలి. తర్వాత కొద్దిగా నీరు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. దీనికి వాటర్ జోడించాల్సిన పనిలదు.
4. కార్న్ ఫ్లోర్ ఆలూ మరియు పనీర్ కు బాగా పట్టేలా మిక్స్ చేయాలి. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
6. నూనె వేడి అయిన తర్వాత అందులో ఆలూ మరియు పన్నీర్ స్టిక్స్ వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత ఇవి బ్రౌన్ కలర్లో వేగే వరకూ వేగించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత టేస్టీ అండ్ ట్యాంగీ సాస్ తో సర్వ్ చేయాలి. అంతే డీ ఫ్రైడ్ స్నాక్ రిసిపి రెడీ...

English summary

Crispy Aloo And Paneer Fried Sticks

Preparing the aloo and paneer fried sticks recipe is very easy. As mentioned, the recipe is prepared using the most basic ingredients that are easily available in your kitchen.
Story first published: Saturday, April 16, 2016, 14:45 [IST]
Desktop Bottom Promotion